Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వినేష్ ఫోగాట్‌కు బిగ్ షాక్: రెండేళ్ల నిషేధం ముప్పు?

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ మరో వివాదంలో చిక్కుకున్నారు. డోపింగ్ నిరోధక నిబంధనల్లో భాగంగా 'వేర్ ఎబౌట్స్' (అందుబాటులో ఉండే సమాచారం) విఫలమైనందుకు అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. 2025 డిసెంబర్ 18న ఔట్-ఆఫ్-కాంపిటీషన్ డోపింగ్ పరీక్ష కోసం అధికారులు ప్రయత్నించినప్పుడు వినేష్ ఫోగాట్ అందుబాటులో లేకపోవడాన్ని ఐటీఏ తీవ్రంగా పరిగణించింది. గత 12 నెలల్లో వినేష్ ఫోగాట్ ఇలా నిబంధనలు పాటించకపోవడం ఇదే మొదటిసారి. మే 4, 2026 నాటి అధికారిక సమాచారంలో ఈ విషయాన్ని రికార్డు చేసినట్లు ఏజెన్సీ స్పష్టం చేసింది.

అసలేం జరిగిందంటే?
నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన అథ్లెట్లు తాము ఎక్కడ ఉంటామో ముందే సమాచారం అందించాలి. తద్వారా డోపింగ్ నియంత్రణ అధికారులు ఎప్పుడైనా వచ్చి నమూనాలను సేకరిస్తారు. 2025 డిసెంబర్ 18న అధికారులు వినేష్ ఫోగాట్ కోసం వెళ్లగా.. ఆమె నిర్దేశించిన సమయానికి అక్కడ లేదు. ఆ సమయంలో తాను హర్యానా అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైనట్లు వినేష్ ఫోగాట్ వివరణ ఇచ్చారు. బెంగళూరు నుంచి చండీగఢ్‌కు ప్రయాణించడం వల్ల దినచర్య మారిపోయిందని.. అలాగే ఇటీవల పండంటి బిడ్డకు జన్మనివ్వడం వల్ల వ్యక్తిగత బాధ్యతలు పెరిగాయని ఆమె పేర్కొన్నారు. అయితే, తన ప్రయాణ వివరాలను ముందుగానే అప్‌డేట్ చేయడంలో వినేష్ నిర్లక్ష్యం వహించారని ఐటీఏ తేల్చి చెప్పింది.

Vinesh Phogat Faces ITA Notice for Missed Doping Test Is a Two-Year Ban Looming

శిక్ష పడే అవకాశం ఉందా?
ప్రస్తుతానికి ఇది యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదు, కేవలం హెచ్చరి మాత్రమే. కానీ, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) నిబంధనల ప్రకారం.. ఒక అథ్లెట్ 12 నెలల కాలంలో మూడు సార్లు ఇలా పరీక్షలకు అందుబాటులో లేకపోయినా లేదా సమాచారం ఇవ్వడంలో విఫలమైనా, దానిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో సదరు అథ్లెట్‌పై రెండేళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంటుంది. వినేష్‌కు ఇది మొదటి విఫల ప్రయత్నం కాబట్టి ప్రస్తుతం ఎలాంటి నిషేధం ఉండదు.

తిరిగి బరిలోకి దిగుతున్న వేళ..
2024 పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన తర్వాత వినేష్ రిటైర్మెంట్ ప్రకటించి.. మళ్లీ గతేడాది డిసెంబర్‌లో రీ-ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆమె గోండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ద్వారా తిరిగి పోటీల్లోకి దిగాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి నోటీసులు రావడం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నోటీసుపై అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ కోరడానికి ఐటీఏ ఆమెకు ఏడు రోజుల సమయం ఇచ్చింది. ఒకవేళ ఆమె సరైన ఆధారాలు చూపలేకపోతే, ఈ 'మిస్డ్ టెస్ట్' ఆమె రికార్డులో శాశ్వతంగా ఉండిపోతుంది.

Story first published: Tuesday, May 5, 2026, 20:54 [IST]
Other articles published on May 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+