ఆరెంజ్ ఆర్మీకి గుడ్ న్యూస్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊరటనిచ్చే వచ్చింది. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయంపై జట్టు హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరీ కీలక అప్‌డేట్ ఇచ్చారు. గత మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ఆడని నితీష్, బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెట్టోరీ వెల్లడించారు. "ఈ ఉదయం నేను నితీష్‌తో మాట్లాడాను, అతను ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాడు. ఈరోజు ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొంటాడు. రేపటి మ్యాచ్‌లో అతను ఆడతాడనే నమ్ముతున్నాం" అని కోచ్ మీడియాకు వెల్లడించారు.
నితీష్ కుమార్ రెడ్డి గైర్హాజరీలో కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ భారీ ఓటమిని చవిచూసింది. నితీష్ స్థానంలో జట్టులోకి వచ్చిన స్మరణ్ రవిచంద్రన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటుతున్న నితీష్ జట్టులో ఉండటం ఎంతో కీలకమని కోచ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గత అక్టోబర్‌లో తొడ గాయం, మెడ నొప్పితో బాధపడిన ఈ యువ ఆటగాడు, ఇప్పుడు కోలుకుని జట్టుకు బలాన్ని ఇస్తుండటం విశేషం.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్ 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ప్లే-ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోవడానికి అత్యంత కీలకం. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు, పంజాబ్‌ను ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది. నితీష్ కుమార్ రెడ్డి తిరిగి రావడం ఆరెంజ్ ఆర్మీకి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications