ఒకే బంతి.. రెండుసార్లు ఔట్! (వీడియో)
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ నితీష్ రానా అవుట్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రానా, చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో షాట్ కొట్టే ప్రయత్నంలో బంతిని గాల్లోకి కొట్టి, అదే సమయంలో తన కాలు వికెట్‌ను తగిలి బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో కార్తిక్ శర్మ క్యాచ్ పట్టగా, సాంకేతికంగా రానా హిట్ వికెట్, క్యాచ్ అవుట్ రెండు ఒకేసారి జరిగాయి. క్రికెట్ చరిత్రలో ఇది అరుదుగా కనిపించే సంఘటన. రానా 13 బంతుల్లో 15 పరుగులు చేసి నిష్క్రమించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రారంభం చాలా నిరాశపరిచింది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కేఎల్ రాహుల్ కేవలం 12 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అతని ఓపెనింగ్ భాగస్వామి పాతుమ్ నిస్సాంక కూడా 19 పరుగులకే పరిమితమయ్యాడు. చెన్నై బౌలర్లు, ముఖ్యంగా నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరిల కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ ధాటికి ఢిల్లీ టాపార్డర్ తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో జట్టు ఒక దశలో కష్టాల్లో పడింది.

ఢిల్లీ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమవుతుందనుకున్న దశలో, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రిజ్వీ కేవలం 24 బంతుల్లో 40 పరుగులతో మెరుపులు మెరిపించాడు, అందులో 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. స్టబ్స్ సైతం 31 పరుగులు చేయడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగుల గౌరవనీయమైన స్కోరును చేరుకుంది. చివర్లో ఆశుతోష్ శర్మ (14), కరుణ్ నాయర్ (12) చిన్నపాటి, కానీ విలువైన పరుగులు అందించారు.
చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కీలక బౌలర్‌గా నిలిచాడు. ఇతను నితీష్ రానాతో సహా రెండు వికెట్లు తీశాడు. అఖిల్ హుస్సేన్, ముఖేష్ చౌదరి, గుర్జప్‌నీత్ సింగ్, జేమీ ఓవర్‌టన్ సైతం ఒక్కో వికెట్ పడగొట్టి ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేశారు. చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఢిల్లీ పెద్ద స్కోరు సాధించలేకపోయింది. ఈ నెమ్మదైన పిచ్‌పై 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే బాధ్యత ఇప్పుడు చెన్నై బ్యాట్స్‌మెన్‌లపై ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications