న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజస్థాన్‌పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ, ప్లే‌ఆఫ్ అవకాశాలు సజీవం

By Nageshwara Rao
 Delhi Daredevils

హైదరాబాద్: కోట్లా వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో ప్లే ఆఫ్ అవకాశాలను ఢిల్లీ సజీవంగా ఉంచుకుంది. 12 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో జోస్ బట్లర్ (26 బంతుల్లో 67) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఆఖరి ఓవర్లలో రాజస్థాన్ వికెట్లు కోల్పోవడంతో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది.

వర్షం కారణంగా గంటన్నర మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. డేర్‌డెవిల్స్ 17.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. మరో 5 బంతుల్లో ఢిల్లీ బ్యాటింగ్ ముగుస్తుందనగా.. వర్షం మ్యాచ్‌కు ఆటంకం కలిగించడంతో మ్యాచ్ నిలిపివేశారు. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో రాజస్థాన్ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 151 పరుగులుగా నిర్ణయించారు.

151 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు బట్లర్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జోస్ బట్లర్ (26 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సులు) ఔటయ్యాక డార్సీ షార్ట్ (25 బంతుల్లో 44) దూకుడుగా ఆడాడు. చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సిన దశలో అనుభవం కలిగిన ట్రెంట్ బౌల్ట్ 10 పరుగులు మాత్రమే ఇచ్చి త్రిపాఠి‌ని ఔట్ చేశాడు.

చివరి రెండు బంతుల్లో రాజస్థాన్ విజయానికి పది పరుగులు అవసరం కాగా.. ఐదో బంతిని బౌండరీకి తరలించిన కృష్ణప్ప గౌతమ్.. ఆరో బంతికి సింగిల్ మాత్రమే తీశాడు. దీంతో నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.


మళ్లీ వర్షంతో నిలిచిన మ్యాచ్: 17.1 ఓవర్లకు ఢిల్లీ 196/6
ఫిరోజ్ షా కోట్లా వేదికగా రాజస్థాన్ రాయల్స్‌-ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి మరోసారి వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో డేర్‌డెవిల్స్ 17.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. మరో 5 బంతుల్లో ఢిల్లీ బ్యాటింగ్ ముగుస్తుందనగా.. వర్షం మ్యాచ్‌కు ఆటంకం కలిగించడంతో మ్యాచ్ నిలిపివేశారు.


ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
కోట్లా వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 166 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ (35 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సులు) దూకుడుగా ఆడే క్రమంలో ఉనద్కత్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత అదే ఓవర్ ఆఖరి బంతికి రిషబ్ పంత్ (29 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సులు) బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 15వ ఓవర్‌లో ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.


హాఫ్ సెంచరీ ముంగిట పృథ్వీ షా ఔట్
కోట్లా వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ రెండో వికెట్ కోల్పోయింది. శ్రేయస్ గోపాల్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ పృథ్వీ షా(25 బంతుల్లోనే 47 పరుగులు) వద్ద అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 8 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 2 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శేయాస్ అయ్యర్ (26), రిషబ్ పంత్ (6) పరుగులతో ఉన్నారు.


5 ఓవర్లకు ఢిల్లీ 48/1
కోట్లా వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. ధవళ్ కులకర్ణి వేసిన మూడో ఓవర్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదిన పృథ్వీ షా 16 పరుగులు రాబట్టాడు. అదే ఓవర్ చివరి బంతికి షా ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను కులకర్ణి అందుకోలేకపోయాడు. ఆ తర్వాత ఉనద్కత్ వేసిన ఐదో ఓవర్లోనూ పృథ్వీ షా వరుసగా 4,4,6తో చెలరేగాడు. దీంతో 5 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా (37), శ్రేయాస్ అయ్యర్ (11) పరుగులతో ఉన్నారు.

1
43442

తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
కోట్లా వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వర్షం కారణంగా మ్యాచ్ గంటన్నర ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. దీంతో ఢిల్లీ జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కోలిన్ మున్రో(0) ధావల్ కులకర్ణీ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి కీపర్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తొలి ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ 1 వికెట్ నష్టానికి ఒక పరుగు చేసింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(0), షా(1) ఉన్నారు.


తగ్గిన వర్షం.. 18 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
టాస్ అనంతరం చిరు జల్లులుగా ప్రారంభమై వర్షం తగ్గుముఖం పట్టింది. దీంతో 9:10కి అంపైర్లు మైదానంలోకి వెళ్లి పిచ్‌ను పరిశీలించారు. మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ 9:30కు ప్రారంభం కానుంది. ముగ్గురు బౌలర్లు నాలుగు ఓవర్లపాటు బౌలింగ్ చేయొచ్చు.


ఢిల్లీ Vs రాజస్థాన్ మ్యాచ్‌కి వర్షం అంతరాయం
ఫిరోజ్‌ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మైదానంలో మ్యాచ్‌ ప్రారంభానికి 10 నిమిషాల ముందు తేలిక పాటి జల్లులతో వర్షం కురవడం మొదలైంది. దీంతో మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు. దీంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కానుంది. వర్షం రెండు, మూడు గంటలు కురిస్తే అంఫైర్లు 5 ఓవర్ల మ్యాచ్‌ సాధ్యపడుతుందేమో చూస్తారు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జైపూర్లో జరిగిన మ్యాచ్‌కి కూడా వర్షం ఆటంకం కలిగించింది. ఆ మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇక ప్రతి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టులో ఒక మార్పు చేయగా.. రాజస్థాన్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఢిల్లీ జట్టులో రాహుల్‌ తెవాటియా స్థానంలో షబాజ్‌ నదీమ్‌ తుది జట్టులోకి రాగా... రాజస్తాన్‌ జట్టులోకి ఇష్‌ సోదీ, మహిపాల్‌ లోమ్రా స్థానంలో డియార్సీ షార్ట్‌, శ్రేయస్‌ గోపాల్‌లు వచ్చారు. ఇక, ఢిల్లీ మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ ఈ మ్యాచ్‌కు సైతం దూరంగా ఉన్నాడు.

ఆరు మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయం సాధించడంతో.. గంభీర్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతాపై ఢిల్లీ విజయం సాధించింది. ఆ తర్వాత చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. ఢిల్లీ జట్టు తన చివరి ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిని సొంత గడ్డ మీద ఆడనుండటం మాత్రమే ఆ జట్టుకు సానుకూలాంశం.

తదుపరి మ్యాచ్‌ల్లో ఏ ఒక్క దాంట్లో ఓడినా.. ఢిల్లీ ప్లేఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ యోచిస్తోంది.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లేఆఫ్ రేసులో వెనుకంజలోనే ఉంది. ఫ్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.

ఇక, రాజస్థాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింట ఓడి పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఆఖరి స్థానంలో ఉండగా, రాజస్థాన్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓటమిపాలై ఆఖరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది.

జట్ల వివరాలు:
ఢిల్లీ డేర్ డెవిల్స్:

పృథ్వీ షా, కోలిన్ మున్రో, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, విజయ్ శంకర్, లైమ్ ప్లంకెట్, అమిత్ మిశ్రా, షాబాస్ నదీమ్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్.

రాజస్థాన్ రాయల్స్:
రహానే(కెప్టెన్), డి ఆర్కీ షార్ట్, సంజూ సామ్సన్, రాహుల్ త్రిపాఠి, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్(కీపర్), కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనద్కట్, ధవల్ కులకర్ణీ

Story first published: Thursday, May 3, 2018, 8:10 [IST]
Other articles published on May 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X