ఐపీఎల్ 2018: స్టార్ క్రికెటర్లు లేని కోల్‌కతా మూడో టైటిల్ నెగ్గేనా?

Posted By:
IPL 2018: Kolkata Knight Riders look the only team that may struggle to field a solid XI

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌.... దిగ్గజ ఆటగాళ్లు ఎక్కువగా లేకపోయినా.. సమర్థమైన నాయకత్వంలో.. అద్భుత ఆటతీరుతో ఐపీఎల్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన జట్టు. ఎప్పుడూ భారత యువ క్రికెటర్లతో కళకళలాడే జట్టులో ఈసారి వారి ప్రాధాన్యం తగ్గింది.

అంతేకాదు కోల్‌కతాను రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిపిన ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఈసారి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో అతడి స్థానంలో యాజమాన్యం దినేష్‌ కార్తీక్‌కు పగ్గాలు అప్పగించింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన నిదాహాస్‌ ట్రోఫీలో చివరి బంతికి సిక్స్‌ కొట్టి రాత్రికి రాత్రే హీరో అయిన దినేశ్ కార్తీక్‌ ఐపీఎల్ 11వ సీజన్‌లో జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.

కోల్‌కతా జట్టులో భారీ మార్పులు

కోల్‌కతా జట్టులో భారీ మార్పులు

ఈసారి జట్టులో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. గంభీర్‌, యూసుఫ్‌ పఠాన్, షకీబ్ ఉల్ హాసన్, ఉమేష్‌ యాదవ్, క్రిస్‌ జోర్డాన్‌‌లాంటి సీనియర్ క్రికెటర్లను జట్టు వదిలేసింది. వారిస్థానంలో వేలంలో దక్కించుకున్న అండర్‌-19 వరల్డ్‌కప్‌ హీరోలు శుభమన్‌ గిల్‌, కమలేష్‌ నాగర్‌కోటి, శివమ్‌ మావిపై జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది.

 పటిష్టంగా బ్యాటింగ్ లైనప్

పటిష్టంగా బ్యాటింగ్ లైనప్

కోల్‌కతా బ్యాటింగ్ లైనప్ ఇప్పటికీ పటిష్టంగా ఉంది. రాబిన్‌ ఉతప్ప, క్రిస్‌ లిన్‌, దినేశ్‌ కార్తీక్‌లతో కోల్‌కతా టాప్‌ఆర్డర్‌ బలంగానే కనిపిస్తోంది. క్రిస్ లిన్ ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగల సమర్ధుడు. వేలంలో రూ.9.6 కోట్లు పెట్టి కొనుక్కున్న ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్‌ లిన్‌ గాయం నుంచి కోలుకోవడం ఆ జట్టుకు ఎంతగానో కలిసొచ్చింది.

మిడిలార్డర్‌లో దినేశ్ కార్తీక్ కీలకం

మిడిలార్డర్‌లో దినేశ్ కార్తీక్ కీలకం

మిడిలార్డర్‌కు దినేశ్ కార్తీక్‌ కీలకం కానుండగా.. శుభమన్‌ గిల్‌తోపాటు ఇషాంక్‌ జగ్గీ, ఆండ్రీ రస్సెల్‌, నితీష్‌ రాణా ఏమేరకు రాణిస్తారో చూడాలి. ఇక, బౌలింగ్‌ విభాగానికి వస్తే మిచెల్‌ స్టార్క్‌ గాయంతో దూరం కావడం పెద్ద దెబ్బ. దీంతో యువ ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్‌, కమలేశ్‌ నాగర్‌కోటి, శివం మావిలపై భారీ అంచనాలున్నాయి.

ఐపీఎల్ 11వ సీజన్‌లో కోల్‌కతా జట్టు

ఐపీఎల్ 11వ సీజన్‌లో కోల్‌కతా జట్టు


స్వదేశీ ఆటగాళ్లు: దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), రాబిన్‌ ఉతప్ప, చావ్లా, ఇషాంక్‌ జగ్గీ, కుల్‌దీప్‌ యాదవ్‌, కమలేశ్‌ నాగర్‌కోటి, నితీష్‌ రాణా, శివం మావి, శుభ్‌మన్‌ గిల్‌, రింకు సింగ్‌, వినయ్‌ కుమార్‌, అపూర్వ్‌ వాంఖడే.

విదేశీ ఆటగాళ్లు: టామ్‌ కురన్‌, కామెరూన్‌ డెల్‌పోర్ట్‌, మిచెల్‌ జాన్సన్‌, క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, ఆంద్రీ రస్సెల్‌, జావన్‌ సీయర్లెస్‌.

కీలక ఆటగాళ్లు: కార్తీక్‌, ఉతప్ప, కుల్‌దీప్‌, క్రిస్‌ లిన్‌, నరైన్‌.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 6, 2018, 16:08 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి