న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ బెట్టింగ్ విద్యార్థి ప్రాణం తీసింది, 11 ఫోన్లు, 2 ల్యాప్‌ట్యాప్‌లు

IPL 2018: CRICKET MATCH BETTING CLAIMS STUDENT’S LIFE

హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా క్రికెట్ వీక్షకులే కాదు. దాంతో పాటు అనధికారంగా బెట్టింగ్ లో పాల్గొని ప్రాణాలు కోల్పోయేవారు కోకొల్లలు. నరాలు తెగిపోయే ఉత్కంఠ, క్షణాల్లో సంపాదన పెరిగిపోవాలి, సరదాగా పందెం వేయాలి అనే ఆకతాయితనం కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి ఘటనే.. ఐపీఎల్‌ బెట్టింగ్ కారణంగా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా‌కి చెందిన గురు (19) నలంద ఐటీఐ కాలేజీలో చదువుతున్నాడు. ఈ నెల 7 నుంచి జరుగుతున్న ఐపీఎల్‌‌‌లో బెట్టింగ్‌ వేస్తూ వచ్చిన గురు.. ఆర్థికంగా నష్టపోయాడు. బెట్టింగ్ నిర్వాహకుడికి పెద్ద మొత్తంలో బాకీ పడ్డాడు. గురువారం ఈ బాకీ విషయమై.. కాలేజీకి వచ్చిన అతను డబ్బులు ఇవ్వాలంటూ గురుని నిలదీశాడు.

దీంతో కాలేజ్‌కి వెళ్లకుండా ఇంటికి వెనుదిరిగిన విద్యార్థి ఎవరూ లేని ప్రదేశంలో పొలాల వద్దకు వెళ్లి ఆత్మహత్య‌కి పాల్పడ్డాడు. ఆత్మహత్యకి పాల్పడే ముందు.. తన స్నేహితుడికి ఫోన్ చేసిన గురు.. తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు చెప్పాడు. ఎంత అడిగినా కారణం చెప్పకపోవడంతో అతని మృతదేహం వద్ద లభ్యమైన ఫోన్ ఆధారంగా వివరాలు సేకరించారు గ్రామస్థులు.

గురు మొబైల్ ఫోన్‌లో బెట్టింగ్‌‌కి సంబంధించిన డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించిన మెసేజ్‌లు ఉండటాన్ని గ్రామస్థులు గుర్తించారు. దీంతో ఫిర్యాదుని అందుకున్న పోలీసులు.. యశ్వంతపూర్‌ ఇండస్ట్రియల్ ఏరియా‌లో బెట్టింగ్‌ నిర్వాహకుడు సోమశేఖర్‌‌ని అరెస్టు చేసి.. అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ. 59,000 నగదు, బెట్టింగ్ వివరాలున్న డైరీని స్వాధీనం చేసుకున్నారు.

కోల్‌కతాలో బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు:
కోల్‌కతాకు దక్షిణంగా ఉన్న ప్రాంతం కాస్బాలో బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసింది. దీంతో వారిపై పోలీసులు దాడికి యత్నించారు. కాస్బాలోని డా. జీఎస్ బోస్ రోడ్డులో పట్టుబడటంతో వారి వద్ద నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

వారి పేర్లు శామియేలు అక్తర్, ఇంజాముల్ హక్, అసదుల్ జమాల్‌గా గుర్తించారు. వారు ముగ్గురూ ముర్షిదాబాద్ జిల్లాలోని రఘునాథ్ గంజ్ ప్రాంతానికి చెందిన వారిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Story first published: Friday, April 20, 2018, 18:16 [IST]
Other articles published on Apr 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X