న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ కోసం ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీపడింది.. చివరకు ఆ ఒక్క కారణంతోనే వదిలేసింది!

IPL 2008 auctioneer Richard Madley recalls IPL bidding war over MS Dhoni
IPL 2022 Mega Auction: MS Dhoni కోసం CSK VS MI హోరాహోరీ, ఎగబడ్డ ఫ్రాంచైజీలు | Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ఇంకా రెండు రోజుల సమయమే ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశం మొత్తం ఈ ధనాధన్ లీగ్ ఫీవరే నడుస్తోంది. మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు, అభిమానులు.. ఇలా ఎవరిని కదలించినా.. ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ ఫామ్ చూసినా ఈ క్యాష్ రిచ్ లీగ్ ముచ్చటే. ఇక లీగ్‌లోనే అత్యంత సక్సెఫుల్ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ కోసం ముంబై ఇండియన్స్ తీవ్రంగా ప్రయత్నించిందని ఐపీఎల్ అరంగేట్ర సీజన్ 2008‌లో ఆక్షనర్‌గా(వేలం పాటు నిర్వహించే వ్యక్తి) వ్యవహరించిన రిచర్డ్ మాడ్లీ గుర్తు చేసుకున్నాడు.

ధోనీ కోసం హోరాహోరీ..

ధోనీ కోసం హోరాహోరీ..

ధోనీ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై మధ్య తీవ్ర పోటీ నడిచిందని చివరకు సచిన్ టెండూల్కర్ కారణంగా అంబానీ టీమ్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాడ్లీ ఆసక్తిక విషయాలు పంచుకున్నాడు. గత 14 ఏళ్ల నిర్వహిస్తున్న వేలంలో ధోనీ కోసం ఫ్రాంచైజీల మధ్య జరిగిన బిడ్ వారే మొదటిదని మాడ్లీ గుర్తు చేసుకున్నాడు.

 కనీస ధరకే షేన్ వార్న్..

కనీస ధరకే షేన్ వార్న్..

‘2008లో తొలిసారి నిర్వహించిన ఐపీఎల్‌ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్ జట్టు.. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్‌ను ఎలాంటి పోటీ లేకుండానే కొనుగోలు చేసింది. అతని కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడంతో రాజస్థాన్ షేన్ వార్నర్‌ను 4,50,000 డాలర్ల బేజ్ ప్రైజ్‌కే కొనుగోలు చేసింది.

ఇక మహేంద్ర సింగ్ ధోనీ వేలంలో అడుగుపెట్టగానే ఫ్రాంఛైజీల మధ్య పోటీ నెలకొంది. అతన్ని కొనుగోలు చేసేందుకు అందులో పాల్గొన్న జట్లు అన్ని ఆసక్తి చూపాయి. అతని సారథ్యంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్ గెలవడంతో ధోనీ కోసం ఫ్రాంచైజీలన్నీ ఎగబడ్డాయి.

1.5 మిలియన్ డాలర్లకు..

1.5 మిలియన్ డాలర్లకు..

ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ హోరా హోరీగా పోటీపడ్డాయి. అతని కనీస ధర రూ. 4 లక్షల డాలర్లు ఉండగా.. తీవ్ర పోటీ నేపథ్యంలో చెన్నై 1.5 మిలియన్ డాలర్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. తమ ప్రధాన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్‌ను తీసుకోవడంతో ముంబై ఇండియన్స్ ధోనీని వదులు కోవాల్సి వచ్చింది. అయితే షేన్ వార్న్ అద్భుతం చేశాడు. ఫ్రాంచైజీలన్నీ ఆసక్తి కనబర్చడంతో తక్కువ ధరకే రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లిన అతను యువ ఆటగాళ్లతో కలిసి జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌గా నిలిచింది.' అని మాడ్లీ తన తొలి వేలం పాట రోజును నెమరువేసుకున్నాడు.

సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా..

సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా..

ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎవరా? అంటే మహేంద్ర సింగ్ ధోనీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే చెన్నై జట్టుకు నాలుగు టైటిళ్లు అందించిన అతను.. 2020 సీజన్ మినహా చెన్నై ఆడిన ప్రతీసారి ప్లే ఆఫ్స్ చేర్చాడు. అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టు కూడా చెన్నై కావడం విశేషం. 2016-17 సీజన్లలో చెన్నై నిషేధానికి గురైనా తర్వాత జరిగిన నాలుగు సీజన్లలో రెండు సార్లు జట్టును విజేతగా నిలిపాడు. అప్ కమింగ్ 2022 సీజన్‌ ధోనీకి చివరి ఐపీఎల్ సీజన్ కానుంది. చెన్నై అభిమానుల మధ్య ఆటకు ఘనంగా వీడ్కోలు పలకాలని ధోనీ భావిస్తున్నాడు.

Story first published: Wednesday, February 9, 2022, 15:52 [IST]
Other articles published on Feb 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X