న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టోక్యో ఒలింపిక్స్‌.. గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా గంగూలీ!!

Indian Olympic Association Invites Sourav Ganguly To Be Goodwill Ambassador For Tokyo Games

కోల్‌కతా: ఈ ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడా బృందానికి 'గుడ్‌విల్‌ అంబాసిడర్‌'గా ఉండాలంటూ టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) కోరింది. ఈ మేరకు గంగూలీకి ఐవోఏ కార్యదర్శి రాజీవ్‌ మెహతా ఓ లేఖ రాశారు. గతేడాది బీసీసీఐ పగ్గాలు చేపట్టిన దాదా తనదైన స్టయిల్లో ముందుకువెళుతున్న విషయం తెలిసిందే.

<strong>విక్టరీ డ్యాన్స్‌.. చహల్‌, అయ్యర్‌ స్టెప్పులు (వీడియో)!!</strong>విక్టరీ డ్యాన్స్‌.. చహల్‌, అయ్యర్‌ స్టెప్పులు (వీడియో)!!

'టోక్యో ఒలింపిక్స్‌లో 14-16 క్రీడా విభాగాల్లో భారత్ నుండి 100-200 మంది అథ్లెట్లు పాల్గొంటారని భావిస్తున్నాం. వీరిలో సీనియర్లు, ఒలింపిక్స్ అనుభవం లేని యువకులు ఉన్నారు. కోట్లాది మంది భారతీయులకు మీరు స్ఫూర్తిగా నిలిచారు. ఓ మంచి పాలకుడిగా యువ ఆటగాళ్లను సానబెడుతున్నారు. భారత బృందానికి మీ మద్దతు ప్రేరణగా నిలుస్తుంది. మా విజ్ఞప్తిని అంగీకరిస్తారని ఆశిస్తున్నాం' అని లేఖలో మెహతా పేర్కొన్నారు.

'ఒలింపిక్స్‌లో ఈ ఎడిషన్ ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ క్రీడలలో దేశం వందవ సంవత్సరం పాల్గొనబోతోంది. గంగూలీ మద్దతు మరియు ప్రేరణ భారత అథ్లెట్లకు చాలా విలువైనది. ముఖ్యంగా యువకులకు స్ఫూర్తిగా ఉంటారు. పాలకుడిగా యువ ఆటగాళ్లను పెంపొందింస్తున్నారు' అని రాజీవ్‌ మెహతా అన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌ ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జపాన్‌లోని టోక్యో నగరంలో జరగునున్నాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, షూటర్‌ అభినవ్‌ బింద్రా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహ్మాన్‌ 'గుడ్‌విల్ అంబాసిడర్స్‌'గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Story first published: Monday, February 3, 2020, 11:21 [IST]
Other articles published on Feb 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X