న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌: ముగిసిన భారత్ పోరాటం

By Nageshwara Rao
Indian men & women end campaign in Badminton Asia Team C'ship

హైదరాబాద్: మలేషియాలోని అలోర్‌ సెటార్‌ వేదికగా జరుగుతోన్న ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పోరాటం ముగిసింది. పురుషులు, మహిళల జట్ల పోరాటానికి క్వార్టర్ ఫైనల్స్‌లోనే తెరపడింది. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాను ఎదుర్కొన్న భారత్ 1-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ల్లో మహిళల జట్టు 1-3తో ఇండోనేషియా చేతిలో ఓడగా.. పురుషుల జట్టు 1-3తో చైనా చేతిలో పరాజయంపాలైంది. సింగిల్స్‌లో సింధు, శ్రీకాంత్‌ మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో భారత జట్లకు ఓటమి తప్పలేదు. గ్రూప్‌-డబ్ల్యూలో హాంకాంగ్‌ను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌ చేరిన భారత మహిళల జట్టు ఇండోనేషియాతో పోరులో తేలిపోయింది.

తొలి సింగిల్స్‌లో సింధు 21-13, 24-22తో ఫిత్రియానిపై నెగ్గి జట్టుకు శుభారంభాన్ని అందించింది. అయితే, ఆతర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారత్ పరాజయాలను చవిచూసింది. ఆ తర్వాత డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి 5-21, 16-21తో గ్రేసియా పోలి-అప్రియాని రహాయు చేతిలో, రెండో సింగిల్స్‌లో శ్రీ కృష్ణప్రియ 8-21, 15-21తో హనా రమాదిని చేతిలో ఓడిపోయారు.

బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మహిళల రెండో డబుల్స్‌లో సింధు, సంయోగిత జంట 9-21, 18-21తో ఆంగియా షిత, మహాదేవి ఇస్తరాని జోడీ చేతిలో పరాజయంపాలైంది. ఈ విజయంతో ఇండోనేషియా 3-1 ఆధిక్యాన్ని అందుకుని సెమీస్‌లోకి అడుగుపెట్టడంతో... రుతుపర్ణ పాండ, జార్జియా మరిస్కా టుంజంగ్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ రద్దయింది.

ఇక, పురుషుల విభాగంలో చైనాతో క్వార్టర్‌ ఫైనల్‌లోనూ భారత్‌కు శభారంభం లభించింది. తొలి సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 14-21, 21-16, 21-7 తేడాతో షి యుకీని ఓడించాడు. అయితే, డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 17-21, 18-21 తేడాతో హీ జిటింగ్, టాంగ్ కియాంగ్ జోడీ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.

రెండో సింగిల్స్‌లో కియావో బిన్‌ను ఎదుర్కొన్న సాయి ప్రణీత్ 21-8, 11-21, 17-21 తేడాతో ఓటమిపాలుకాగా... రెండో డబుల్స్‌లో మనూ అత్రి, సుమీత్ రెడ్డి జోడీ 21-14, 19-21, 14-21 తేడాతో హన్ చెంగ్‌కాయ్, జూ హవోడాంగ్ జోడీ చేతిలో పరాజయాన్ని చవిచూడడంతో చైనా 3-1 ఆధిక్యంతో గెలిచింది. దీనితో సమీర్ వర్మ, జావో జున్‌పెంగ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ని రద్దు చేశారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, February 10, 2018, 10:55 [IST]
Other articles published on Feb 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X