న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొన్న వన్డేల్లో నేడు టీ20ల్లో: విండిస్ చెత్త రికార్డుల పరంపర

India vs West Indies: Team India Report Card - The hits & misses at the 1st T20I in Kolkata

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత జట్టుతో జరిగిన తొలి టీ20లో పర్యాటక వెస్టిండిస్ జట్టు ఓ చెత్త రికార్డుని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీ20ల్లో భారత్‌పై అత‍్యల్ప స్కోరును నమోదు చేసింది.

<strong>ఈడెన్‌‌లో విండిస్ ఒకే ఒక్క సిక్స్: టీ20ల్లో ఆరోసారి</strong>ఈడెన్‌‌లో విండిస్ ఒకే ఒక్క సిక్స్: టీ20ల్లో ఆరోసారి

2014లో మిర్‌పుర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 129 పరుగులు చేసిన వెస్టిండిస్ జట్టు తాజాగా దానిని సవరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ వెస్టిండిస్ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఉమేశ్ యాదవ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ రామ్‌దిన్(2)ను పెవిలియన్‌కు చేర్చాడు.

దూకుడు కనబరిచిన హెట్‌మెయిర్

దూకుడు కనబరిచిన హెట్‌మెయిర్

క్రీజులోకి వచ్చి రావడంతోనే హెట్‌మెయిర్ బౌండరీతో దూకుడు కనబరిచాడు. కానీ మరుసటి ఓవర్లోనే విండీస్‌కు షాయి హోప్(14) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. పాండే రనౌట్ చేయడంతో హోప్ పెవిలియన్ చేరాడు. హెట్‌మయిర్(10) దూకుడుగా ఆడే క్రమంలో బుమ్రా బౌలింగ్‌లో కార్తీక్ క్యాచ్‌తో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.

3 వికెట్లు కోల్పోయి వెస్టిండిస్ 31 పరుగులు

3 వికెట్లు కోల్పోయి వెస్టిండిస్ 31 పరుగులు

దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి వెస్టిండిస్ 31 పరుగులు చేసింది. అనంతరం కృనాల్ పాండ్యా ఓవర్లో కీరన్ పొలార్డ్ ఓ భారీ సిక్స్‌ బాదాడు. ఆ తర్వాత మరోమారు భారీ షాట్ కోసం ప్రయత్నించిన పొలార్డ్.. కృనాల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం ఓవర్లలో డారెన్ బ్రావో(5), పావెల్(4), కెప్టెన్ బ్రాత్‌వైట్(4) వెంటవెంటనే నిష్క్రమించారు.

17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన భారత్

17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన భారత్

దీంతో జట్టు స్కోరు 87 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో అలెన్(27), పాల్(15 నాటౌట్)లు బౌండరీలతో ఆకట్టుకోవడంతో వెస్టిండిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 109 పరుగులు చేసింది. అనంతరం విండీస్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో

మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో

దీంతో తొలి టీ20లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకముందు తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో వన్డేలో విండిస్ బ్యాట్స్‌మన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. టాపార్డర్‌తో సహా అందరూ విఫలం కావడంతో విండిస్‌ 104 పరుగులకే ఆలౌటైంది.

అత్యల్ప స్కోరును నమోదు చేసిన చెత్త రికార్డు

అత్యల్ప స్కోరును నమోదు చేసిన చెత్త రికార్డు

ఫలితంగా వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై అత్యల్ప స్కోరును నమోదు చేసిన చెత్త రికార్డుని వెస్టిండిస్ జట్టు సొంతం చేసుకుంది. భారత్‌పై వన్డేల్లో విండీస్‌కు అత్యల్ప స్కోరుగా నమోదైంది. వన్డే సిరిస్ ముగిసిన నాలుగు రోజుల వ్యవధిలోనే విండీస్‌ మరోసారి తడబడటంతో మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది.

Story first published: Monday, November 5, 2018, 17:03 [IST]
Other articles published on Nov 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X