న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'హార్దిక్‌ స్థానాన్నిభర్తీ చేయడం కోసం రాలేదు.. నా స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం వచ్చా'

India vs West Indies: Shivam Dube says Im not here to replace Hardik Pandya, Im here to do well for my country

హైదరాబాద్‌: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయడం కోసం జట్టులోకి రాలేదు. నేను ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం కోసం టీమిండియా తరఫున ఆడటం లేదు. నా ప్రదర్శనతోనే జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం వచ్చా అని యువ ఆల్‌రౌండర్‌ శివం దూబే అన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి శివం దూబే అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

కేవలం 11 మ్యాచ్‌లే.. టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా ప్రణాళిక ఇదే?కేవలం 11 మ్యాచ్‌లే.. టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా ప్రణాళిక ఇదే?

 చివరి టీ20లో మూడు వికెట్లు:

చివరి టీ20లో మూడు వికెట్లు:

దూబే బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. బౌలింగ్‌తో మాత్రం రాణించాడు. నిర్ణయాత్మక మూడో టీ20లో మూడు వికెట్లు తీసాడు. దాంతో దూబేను విండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. మరొకవైపు శస్త్ర చికిత్స కారణంగా హార్దిక్‌ పాండ్యా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ తరుణంలో హార్దిక్‌ స్థానాన్ని దూబే భర్తీ చేస్తాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా దూబే స్పందించాడు.

హార్దిక్‌ స్థానాన్నిభర్తీ చేయడం కోసం రాలేదు:

హార్దిక్‌ స్థానాన్నిభర్తీ చేయడం కోసం రాలేదు:

'హార్దిక్‌ పాండ్యా స్థానంతో సంబంధం లేదు. నేను హార్దిక్‌ స్థానాన్నిభర్తీ చేయడం కోసం ఇక్కడికి రాలేదు. టీమిండియా తరఫున పోరాడడం కోసం వచ్చా. నేను కేవలం భారత క్రికెట్‌ జట్టులో సభ్యుడిని మాత్రమే. నా ప్రదర్శనతోనే నేను స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం జట్టులోకి వచ్చా. నాకు మంచి అవకాశం లభించింది. నా దేశం కోసం బాగా ఆడటమే నా ముందున్న కర్తవ్యం' అని దూబే తెలిపాడు.

కెప్టెన్, కోచ్ అండగా ఉన్నారు:

కెప్టెన్, కోచ్ అండగా ఉన్నారు:

'జట్టు సభ్యులు అందరూ ప్రోత్సహిస్తున్నారు. కెప్టెన్, కోచ్ సహా అందరూ అండగా ఉన్నారు. డ్రెస్సింగ్ రూంలో ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నాను. ఆల్‌రౌండర్‌గా రాణించాలంటే ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం. ఒకేసారి బ్యాటింగ్, బౌలింగ్ చేయాలంటే చాలా ఫిట్‌నెస్‌ ఉండాలి. అది సాధించడం ఎంతో ముఖ్యం. నా బౌలింగ్ పట్ల నమ్మకం ఉంది. మంచి బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలి' అని దూబే పేర్కొన్నాడు.

అప్పుడే పోలికలా:

శివం దూబేను తనతో పోల్చవద్దని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ అన్న సంగతి తెలిసిందే. కేవలం ఒక్క బ్యాటింగ్‌ శైలి కారణంగా దూబేను తనతో ఎందుకు పోల్చుతారంటూ యువీ మండిపడ్డాడు. ముందుగా దూబేను సాఫీగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసే అవకాశం ఇవ్వాలని, ఆ తర్వాత వేరే ఒకరితో పోల్చవచ్చంటూ యువీ తెలిపాడు.

Story first published: Thursday, December 5, 2019, 12:25 [IST]
Other articles published on Dec 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X