న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పృథ్వీషాను చూస్తుంటే సంతోషంగా ఉంది: ఓపెనర్‌గా స్పష్టత ఇవ్వని రహానే

India vs west indies : Prithvi Shaw Should Bat Just like He Does For Mumbai In Ranji Trophy|Oneindia
India vs West Indies: Prithvi should bat just like he does for Mumbai in Ranji Trophy: Rahane

హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టెస్టు రాజ్కోట్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరిస్‌లో అరంగేట్రం చేసే అవకాశమున్న యువ ఓపెనర్ పృథ్వీషా తన బ్యాటింగ్‌లో దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం లేదని టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ రహానే అన్నాడు.

<strong>ధావన్‌ టెస్టు కెరీర్ ముగిసి పోలేదు: తొలిసారి నోరు విప్పిన ఎమ్మెస్కే ప్రసాద్‌</strong>ధావన్‌ టెస్టు కెరీర్ ముగిసి పోలేదు: తొలిసారి నోరు విప్పిన ఎమ్మెస్కే ప్రసాద్‌

అతడు తన సహాజశైలిలోనే ఆడితేనే బాగుంటుందని సూచించాడు. తాజాగా, మంగళవారం రహానే మాట్లాడుతూ "పృథ్వీషాను చూస్తుంటే సంతోషంగా ఉంది. చిన్నప్పట్నుంచి అతడిని చూస్తున్నా. మేమిద్దరం కలిసి సాధన చేశాం. అతను దూకుడు స్వభావం ఉన్న ఓపెనర్‌. భారత్‌-ఏ తరఫున రాణించాడు. ఫలితం అందుకున్నాడు" అని అన్నాడు.

విండిస్‌తో టెస్టు సిరిస్‌లో ఒత్తిడేమీ లేదు

విండిస్‌తో టెస్టు సిరిస్‌లో ఒత్తిడేమీ లేదు

"ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతామో నాకు పర్సనల్‌గా తెలియదు. ఒత్తిడేమీ లేదు. ప్రతి ఒక్కరూ తమ సత్తా తెలియజేసేందుకు ఇదో చక్కని అవకాశం. ముంబై, భారత్‌-ఏ తరఫున ఆడినట్టే ఇక్కడా ఆడాలని పృథ్వీషాకు సలహా ఇస్తున్నా. మయాంక్‌, పృథ్వీషా, సిరాజ్‌ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించారు" అని రహానే అన్నాడు.

అత్యుత్తమంగా ఆడటమే ఇక్కడ ముఖ్యం

అత్యుత్తమంగా ఆడటమే ఇక్కడ ముఖ్యం

"బ్యాట్స్‌మెన్‌గా పరుగులు చేస్తారు. బౌలర్‌గా వికెట్లు తీస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అత్యుత్తమంగా ఆడటమే ఇక్కడ ముఖ్యం" అని రహానే అన్నాడు. ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో రహానే పెద్దగా రాణించింది లేదు. అయితే, ఆ తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టుని విజయవంతంగా ముందుకు నడిపించాడు.

విజయ్ హజారే ట్రోఫీలో మెరిసిన రహానే

విజయ్ హజారే ట్రోఫీలో మెరిసిన రహానే

బరోడా, కర్ణాటక, రైల్వేస్‌ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో ముంబై జట్టు విజయాలు నమోదు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. వెస్టిండిస్‌తో టెస్టు సిరిస్‌కు ముందు ఇది అతడికి బాగా ఉపయోగపడింది. దేశవాళీ, అంతర్జాతీయ లేదా ప్రాక్టీస్ మ్యాచ్‌ ఏదైనా తాను ఒకే విధంగా సన్నద్ధమవుతానని రహానే ఈ సందర్భంగా చెప్పాడు.

కేఎల్‌ రాహుల్‌తో ఓపెనర్‌గా మయాంక్‌ అగర్వాల్‌ లేదా పృథ్వీషా

అయితే, వెస్టిండిస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కేఎల్‌ రాహుల్‌తో ఓపెనర్‌గా మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీషాల్లో ఎవరు వస్తారనే విషయంపై మాత్రం రహానే స్పష్టంగా చెప్పలేకపోయాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం అవుతుండగా, రెండో టెస్టు అక్టోబర్ 12 నుంచి హైదారాబాద్ వేదికగా జరగనుంది.

Story first published: Tuesday, October 2, 2018, 20:17 [IST]
Other articles published on Oct 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X