న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండిస్ పేస్ దిగ్గజం కోర్ట్నీ వాల్ష్‌ నా తండ్రి కాదు: హేడెన్‌ వాల్ష్‌

 India vs West Indies: ‘My father is not Courtney Walsh,’ says leg-spinner Hayden Walsh

హైదరాబాద్: 'మరోసారి చెబుతున్నా. నా తండ్రి దిగ్గజ పేసర్‌ కోర్ట్నీ వాల్ష్‌ కాదు' అని వెస్టిండీస్‌ లెగ్‌స్పిన్నర్‌ హేడెన్‌ వాల్ష్‌ పేర్కొన్నాడు. ఇద్దరి పేర్లలో వాల్ష్‌ ఉండడంతో చాలామంది హేడెన్‌.. కోర్ట్నీ వాల్ష్‌ కుమారుడిగా పొరపడుతున్నారు. దీంతో మరోసారి హేడెన్‌ వివరణ ఇచ్చాడు.

85 కోట్లు: రాజస్థాన్ రాయల్స్‌లో తన 3 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమైన షేన్ వార్న్85 కోట్లు: రాజస్థాన్ రాయల్స్‌లో తన 3 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమైన షేన్ వార్న్

రెండు వికెట్లతో రాణించిన హేడెన్‌ వాల్ష్‌

రెండు వికెట్లతో రాణించిన హేడెన్‌ వాల్ష్‌

ఆదివారం తిరునంతపురం వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్లతో రాణించిన హేడెన్‌ వాల్ష్‌ మీడియాతో మాట్లాడుతూ "నేను కెనడాలో జరిగిన టీ20 లీగ్‌లో ఆడుతుండగా ఎవరో నన్ను కోర్ట్నీ వాల్ష్‌ అని పిలిచారు. కానీ, ఆయన నా తండ్రి కాదు. ఇకనుంచైనా నేనెవరో అంతా గుర్తిస్తారని అనుకుంటున్నా" అని పేర్కొన్నాడు.

శివమ్‌ దూబేను ఔట్‌ చేయడంపై

శివమ్‌ దూబేను ఔట్‌ చేయడంపై

ఇక, రెండో టీ20లో శివమ్‌ దూబేను ఔట్‌ చేయడంపై "మా లెఫ్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవిన్‌ లూయిస్‌, నికోలస్‌ పూరన్‌లకు నెట్స్‌లో చాలా బంతులేశా. ఆ అనుభవంతో శివమ్‌కు బౌలింగ్‌ చేయడానికి ఆత్మవిశ్వాసం లభించింది. ఈ ప్రదర్శన నాకెంతో సంతోషాన్నిచ్చింది" హేడెన్‌ వాల్ష్‌ పేర్కొన్నాడు.

క్రికెట్‌లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు

క్రికెట్‌లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు

"క్రికెట్‌లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోడానికి చాలా కష్టపడుతున్నా. ఇప్పుడు నేను చందమామ మీద ఉన్నాననిపిస్తోంది. సీపీఎల్‌లో మంచి ప్రదర్శన చేయడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డా. నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేశా. నా ముందున్న ప్రధాన లక్ష్యం ఇప్పుడు మా జట్టును గెలిపించడమే. సిరీస్‌ కైవసం చేసుకునేందుకు నా వంతు కృషి చేస్తా" అని వాల్ష్ అన్నాడు.

కోర్ట్నీ వాల్ష్‌ 1984 నుంచి 2001 వరకు

కోర్ట్నీ వాల్ష్‌ 1984 నుంచి 2001 వరకు

ఇదిలా ఉంటే, వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం కోర్ట్నీ వాల్ష్‌ 1984 నుంచి 2001 వరకు ప్రాతినిథ్యం వహించాడు. తాను ఆడిన రోజుల్లో కోర్ట్నీ వాల్ష్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్‌గా రాణించాడు. ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది. ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 బుధవారం ముంబైలో జరగనుంది.

Story first published: Tuesday, December 10, 2019, 8:12 [IST]
Other articles published on Dec 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X