న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ గూగ్లీకి రోహిత్‌ శర్మ క్లీన్ బౌల్డ్

By Nageshwara Rao
Dhawan, Iyer put India in command in chase of 216

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. రెండో వన్డేలో డబుల్ సెంచరీతో మెరిసిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (7) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.

India vs Sri Lanka 2017 3rd ODI Score Card

ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్ వేసిన మిస్టరీ స్పిన్నర్ అఖిల ధనంజయ వేసిన 3.2వ బంతిని భారీ సిక్సర్‌గా మలిచిన రోహిత్‌ నాలుగో బంతికి బౌల్డ్‌ అయ్యాడు. దీంతో మైదానం ఒక్కసారిగా మూగబోయింది. దీంతో భారత్ జట్టు 14 పరుగుల వద్దే తొలి వికెట్‌ని చేజార్చుకుంది.

రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. దీంతో 10 ఓవర్లకు గాను భారత్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ప్రస్తుతం ధావన్‌ (27), శ్రేయస్‌ అయ్యర్‌ (14) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 215 పరుగులకే ఆలౌటైంది.

భారత్ బౌలర్లు చాహల్ (3/46), కుల్దీప్ యాదవ్ (3/42), హార్దిక్ పాండ్యా (2/49) అద్భుత ప్రదర్శన చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 44.5 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌కు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

శ్రీలంక బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ ఉపుల్ తరంగ (95) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆ జట్టుకి శుభారంభనిచ్చినా మిడిలార్డర్‌ పరుగుల రాబట్టడంలో విఫలమైంది. సమరవిక్రమ (42), మాథ్యూస్ (17), డిక్వెల్లా (8), కెప్టెన్ తిసార పెరీరా (6) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 17, 2017, 18:39 [IST]
Other articles published on Dec 17, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X