Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తాడులా పెరగడం కాదు.. చిన్నపిల్లాడని చూడకుండా ఏంటా రచ్చ! (వీడియో)

ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన పోరులో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ ఉత్కంఠభరిత పోరులో అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఓ మినీ వార్ అర్థాంతరంగా ముగియడం అభిమానులను నిరాశకు గురిచేసింది. 15 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ ఆడుతూ రికార్డులు సృష్టిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసే బంతులను ఎలా ఎదుర్కొంటాడో చూడాలని అందరూ భావించారు. అయితే ఆ అసలు సిసలు పోరు మొదలవ్వకముందే ఢిల్లీకి చెందిన పొడవైన పేసర్ కైల్ జేమిసన్ తన పదునైన యార్కర్‌తో వైభవ్‌ను పెవిలియన్‌కు పంపాడు.

వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని, పవర్‌ప్లేలో పరుగుల వరద పారిస్తాడని అభిమానులు ఆశించారు. కైల్ జేమిసన్ వేసిన ఓవర్లో తను ఎదుర్కొన్న మొదటి బంతికే అద్భుతమైన ఫోర్ కొట్టిన వైభవ్.. మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. స్టేడియం మొత్తం వైభవ్ నామస్మరణతో హోరెత్తింది. కానీ తర్వాతి బంతికే సీన్ రివర్స్ అయింది. జేమిసన్ సంధించిన ఖచ్చితమైన యార్కర్ వైభవ్ బ్యాట్ లోపలి అంచుకు తగిలి నేరుగా స్టంప్స్‌ను ఎగరగొట్టింది. దీంతో కేవలం 4 పరుగులకే ఈ యువ ఆటగాడి 'తుపాన్' ఇన్నింగ్స్ ముగిసిపోయింది. గతంలో బుమ్రా, కమిన్స్ వంటి దిగ్గజాలనే ఆడుకున్న వైభవ్, జేమిసన్ వేసిన పక్కా ప్లాన్‌కు చిక్కడం గమనార్హం.

Kyle Jamieson vs Vaibhav Sooryavanshi Controversial Sendo-off in RR vs DC IPL 2026 Match Details

ఈ వికెట్ పడిన తర్వాత కైల్ జేమిసన్ ప్రదర్శించిన ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా మైదానంలో చాలా ప్రశాంతంగా ఉండే జేమిసన్, వైభవ్ వికెట్ తీయగానే ఒక్కసారిగా ఆవేశానికి లోనయ్యాడు. వైభవ్ దగ్గరకు వెళ్లి చాలా అగ్రెసివ్‌గా సెండాఫ్ ఇస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఓ 15 ఏళ్ల చిన్న కుర్రాడిని ఔట్ చేసిన తర్వాత అంత పెద్ద బౌలర్ అలా ప్రవర్తించడం అవసరమా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాటిచెట్టులా పెరగడం కాదు.. చిన్నపిల్లాడితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకో అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైభవ్ ఎంతటి ప్రమాదకరమైన ఆటగాడో.. అతడి వికెట్ ఢిల్లీకి ఎంత ముఖ్యమో జేమిసన్ వేడుకలే నిదర్శనమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్టార్క్‌ను టార్గెట్ చేయాలనుకున్న వైభవ్ సూర్యవంశీ వ్యూహం ఫలించకపోవడం రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే పెద్ద దెబ్బగా మారింది. పవర్‌ప్లేలో జట్టుకు శుభారంభం ఇచ్చే క్రమంలో వైభవ్ నిరాశగా వెనుదిరిగినా.. ఈ సంఘటన అతడికి ఒక పాఠం లాంటిదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. జేమిసన్ లాంటి బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ వికెట్ గుర్తుచేసింది. ఏదేమైనా ఈ చిన్నపాటి గొడవ ఐపీఎల్‌లో ఒక కొత్త వైరాన్ని రాజేసింది. మరి తర్వాతి పోరులో వైభవ్ దీనికి ఎలా బదులిస్తాడో చూడాలి.

Story first published: Friday, May 1, 2026, 22:04 [IST]
Other articles published on May 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+