న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ind vs Sa 1st ODI : మిల్లర్, క్లాసెన్ హాఫ్ సెంచరీల జోరు.. ఇండియా ముందు టఫ్ టార్గెట్..!

India vs Southafrica 1st ODI: Miller, Klassen Halfcenturies Helpedroteas to Give Target 250 to India

లక్నో: భారత్ - సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లక్నో వేదికగా జరిగిన తొలి వన్డే‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 40ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 249పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (48పరుగులు 54బంతుల్లో 5ఫోర్లు) ఆకట్టుకోగా.. డేవిడ్ మిల్లర్ (75పరుగులు 63బంతుల్లో 5ఫోర్లు 3సిక్సర్లు నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్ (74పరుగులు 65బంతుల్లో 6ఫోర్లు 2సిక్సర్లు నాటౌట్) హాఫ్ సెంచరీలతో కడవరకు నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును పెంచారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, అరంగేట్ర బౌలర్ రవి బిష్ణోయ్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.

వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభం

వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభం

ఇక షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు టాస్ వేసి 1.30కు మ్యాచ్ స్టార్ట్ కావాల్సి ఉండగా.. వర్షంతో మైదానం తడిసిపోవడంతో అంతరాయం కలిగింది. మధ్యాహ్నం 3.30కు టాస్ వేసి 3.45కు మ్యాచ్ ప్రారంభించారు. దీంతో మ్యాచ్ 40ఓవర్లకు కుదించారు. ఈ సిరీస్‌కు శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగింది. రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్ అరంగేట్రం చేశారు. ఇక టాస్ గెలిచిన శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

71పరుగులకే 3వికెట్లు

71పరుగులకే 3వికెట్లు

సౌతాఫ్రికా ఓపెనర్లు జన్నేమన్ మలాన్, క్వింటన్ డికాక్ బరిలోకి దిగారు. వీరిద్దరు వికెట్ కాపాడాలనే ఉద్దేశంతో ఆడినట్లు స్పష్టంగా అర్థమయింది. ప్రారంభ వికెట్లు కోల్పోకూడదనేది తన ఇంటెన్షన్ అని బవుమా చెప్పిన సంగతి తెలిసిందే. దాన్ని వీరిద్దరు అమలు పరిచారు. 12ఓవర్ల వరకు ఆచితూచి ఆడారు. ఇక 49పరుగుల వీరి భాగస్వామ్యాన్ని శార్దూల్ ఠాకూర్ విడదీశాడు. జన్నేమన్ మలాన్ (22పరుగులు 42బంతుల్లో 3ఫోర్లు)ను క్యాచ్ ఔట్ చేశాడు. అలాగే 14వ ఓవర్లో కెప్టెన్ బవుమా (8పరుగుల)ను కూడా శార్దూల్ ఠాకూర్ బౌల్డ్ చేశాడు. తర్వాతి 15వ ఓవర్లో మార్క్రమ్ (0)ను కుల్దీప్ బౌల్డ్ చేశాడు. దీంతో 16ఓవర్లకే 71పరుగులకు 3కీలక వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా కష్టాల్లో పడింది.

మిల్లర్, క్లాసెన్ 149పరుగుల భాగస్వామ్యం

మిల్లర్, క్లాసెన్ 149పరుగుల భాగస్వామ్యం

అయితే డికాక్.. హెన్రిచ్ క్లాసెన్ కలిసి కాసేపు వికెట్ కాపాడుతూ ఆడారు. వీరిద్దరు 39పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే అరంగేట్ర బౌలర్ అయిన రవి బిష్ణోయ్.. డికాక్‌ను ఎల్బీబ్ల్యూగా ఔట్ చేశాడు. సౌతాఫ్రికా రివ్యూ తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 110పరుగులకు 4వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా ఆ తర్వాత మరో వికెట్ కోల్పోలేదు. డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ ఇన్నింగ్స్ కడవరకు నిలిచారు. వన్డేల్లో వికెట్ కాపాడుకోవడం ఎంత ముఖ్యమో తెలిసిన వీరు.. చాలా నిదానంగా ఆడుతూ.. స్కోరు బోర్డును నిలకడగా ముందుకు నడిపించారు.

ఇన్నింగ్స్ ప్రారంభంలో మిల్లర్ ధాటిగా ఆడినప్పటికీ.. తర్వాత కాస్త నెమ్మదించాడు. వీరిద్దరు ఈ క్రమంలో తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇక వీరు చివరి పది ఓవర్లలో 85పరుగులు దండుకున్నారు. ఇక భారత ఫీల్డర్లు పలు క్యాచ్‌లు మిస్ చేయడం కూడా వీళ్లకు కలిసొచ్చింది. దీంతో ఇండియా ముందు 250పరుగుల భారీ టార్గెట్ ఉంచగలిగారు.

ఇరు జట్లు:

ఇరు జట్లు:

భారత్ ( ప్లేయింగ్ XI ): శిఖర్ ధావన్ ( కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి, తబ్రైజ్ షమ్సీ

Story first published: Thursday, October 6, 2022, 19:20 [IST]
Other articles published on Oct 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X