న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓపెనర్‌గా నేను చేసిన తప్పునే!: రోహిత్ శర్మకు వీవీఎస్ లక్ష్మణ్ విలువైన సూచన

India vs South Africa: VVS Laxman Hopes Rohit Sharma Wont Make Same Mistakes He Did As Test Opener

హైదరాబాద్: టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మ తన టెక్నిక్‌తో పాటు మైండ్ సెట్‌ను మార్చుకోవద్దని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అక్టోబర్ 2 నుంచి విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్టులో రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.

టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు 6వ స్థానంలో బ్యాటింగ్‌లో దిగే రోహిత్ శర్మ తొలిసారి టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్ శర్మ విజయవంతమైన ఓపెనర్‌. అందులో ఎలాంటి సందేహాం లేదు. అయితే, టెస్టుల్లో మాత్రం రోహిత్ శర్మకు ఓపెనింగ్ అనేది ఓ ఛాలెంజ్. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.

రెండో బంతికే డకౌట్: దక్షిణాఫ్రికాతో ఓపెనర్‌గా నిరాశపరిచిన రోహిత్ శర్మరెండో బంతికే డకౌట్: దక్షిణాఫ్రికాతో ఓపెనర్‌గా నిరాశపరిచిన రోహిత్ శర్మ

వీవీఎస్ లక్ష్మణ్ కూడా తన కెరీర్ తొలినాళ్లలో ఓపెనర్‌గా ఆడాడు. అయితే, ఆ తర్వాత టెస్టుల్లో టీమిండియా మిడిలార్డర్‌లో కీలక ఆటగాడు అయ్యాడు. ఇప్పటివరకు టెస్టుల్లో మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్ శర్మ తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగుతుండటంతో అతడి బ్యాటింగ్ టెక్నిక్, మైండ్ సెట్ విషయంలో వీవీఎస్ లక్ష్మణ్ విలువైన సూచన చేశాడు.

ఓ యూట్యూబ్ షోలో

ఓ యూట్యూబ్ షోలో

మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్త యూట్యూబ్ షో "దీప్ పాయింట్"కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్ "నేను చేసిన పొరపాటు నా మనస్తత్వాన్ని మారుస్తుందని నేను నమ్ముతాను. అదే నాకు మిడిలార్డర్‌లో నంబర్ 3 లేదా నంబర్ 4 స్థానంలో గ్రేట్ సక్సెస్ వచ్చేలా చేసింది. ఒక మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ముందు ఒత్తిడి ఉండటంతో నేను బంతివైపుకి వెళ్లి ఆడతాను" అని అన్నాడు.

బ్యాటింగ్ టెక్నిక్‌ను

బ్యాటింగ్ టెక్నిక్‌ను

సీనియర్ ఆటగాళ్లు, మాజీ ఓపెనర్లు, తన కోచ్‌లు ఇచ్చిన సలహాతో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో తన బ్యాటింగ్ టెక్నిక్‌ను అనుకూలంగా మార్చుకోవడం జరిగిందని లక్ష్మణ్ తెలిపాడు. "నేను ఫాస్ట్ బౌలర్లు కోర్ట్నీ వాల్స్, ఆంబ్రోస్ లాంటి వారు బౌన్స్‌తో పాటు చక్కటి లెంత్‌ బంతులను సంధించగలరు. వాటిని ఎదుర్కొవాలంటే వెనక్కి వెళ్లి క్రాస్‌గా ఆడాలి" అని లక్ష్మణ్ తెలిపాడు.

కొత్త బంతిని ఎదుర్కొనేటప్పుడు

కొత్త బంతిని ఎదుర్కొనేటప్పుడు

కొత్త బంతిని ఎదుర్కొనేటప్పుడు మరింత మానసిక క్రమశిక్షణ అవసరమని, సహజమైన ఆటలో చాలా మార్పులు అవసరం కాబట్టి, మీ పనితీరును దెబ్బతీస్తాయని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. "ఓపెనర్‌గా మానసిక క్రమశిక్షణ అవసరం. ఆఫ్ స్టంప్‌కు అవలగా వెళుతున్న బంతులను వదిలేయడం దగ్గర నుంచి.. సహజమైన ఆటలో చాలా మార్పులు అవసరం" అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

రోహిత్ శర్మకు ఇదొక గొప్ప అవకాశం

రోహిత్ శర్మకు ఇదొక గొప్ప అవకాశం

అయితే, ఓపెనర్‌గా రోహిత్ శర్మకు ఇదొక గొప్ప అవకాశమని లక్ష్మణ్ తెలిపాడు. "4 టెస్టులు ఆడిన తర్వాత నేను ఓపెనర్‌గా వెళ్లా. అతడు మాత్రం 12 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ అనుభవం వచ్చిన తర్వాత ఓపెనర్‌గా ఆడుతున్నాడు. పరిణితితో పాటు మంచి ఫామ్‌లో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ... రహానేతో కలిసి ఐదో స్థానంలో, హనుమ విహారితో కలిసి ఆరో స్థానంలో ఆడాలి" అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

Story first published: Saturday, September 28, 2019, 16:06 [IST]
Other articles published on Sep 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X