న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాంచీ టెస్టులో సాహా వేలు చితికింది: వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్

IND vs SA 3rd Test : Rishabh Pant Replaces Injured Wriddhiman Saha || Oneindia Telugu
 India vs South Africa Live Score 3rd Test Day 3: Rishabh Pant replaces injured Wriddhiman Saha

హైదరాబాద్: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ వేసిన 27 ఓవర్‌ తొలి బంతిని అందుకునే క్రమంలో సాహా చేతి వేలికి గాయమైంది. దీంతో భారత ఫిజియోతో కలిసి సాహా మైదానాన్ని వీడాడు.

దీంతో సాహో స్థానంలో స్టాండ్‌ బై కీపర్‌గా ఉన్న రిషభ్‌ పంత్‌ ప్రస్తుతం ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫీల్డింగ్‌ చేస్తున్న వికెట్ కీపర్‌కు ఏమైనా సమస్య తలెత్తితే స్టాండ్‌ బైగా ఉన్న వికెట్ కీపర్‌ కీపింగ్‌ చేయవచ్చు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పంత్ ఎంపికైన సంగతి తెలిసిందే.

పేలవ ప్రదర్శన కారణంగా

అయితే, పేలవ ప్రదర్శన కారణంగా ఈ సిరిస్‌లో చోటు దక్కించుకోలేపోయాడు. విశాఖ టెస్టులో సాహా అద్భుత ప్రదర్శన చేయడంతో రెండో టెస్టుకు కూడా సాహానే జట్టు మేనేజ్‌మెంట్ కొనసాగించింది. అయితే, గాయం కారణంగా మూడో టెస్టులో సాహా మైదానాన్ని వీడటంతో పంత్‌ గ్లౌవ్స్ ధరించి కీపింగ్ చేస్తున్నాడు. రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఓటమి దిశగా సాగుతోంది.

48 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు

ఆటలో భాగంగా మూడోరోజైన సోమవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 48 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇంకా 132 పరుగుల వెనుకంజలోనే ఉంది. ఇన్నింగ్స్‌ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ముందు ఈ పరుగులు సాధించాలి. ఇంకా రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో టీమిండియా ఇన్నింగ్స్ భారీ విజయం ఖాయంగా కనబడుతోంది.

షమీకి మూడు వికెట్లు

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో షమీ మూడు వికెట్లు తీయగా... ఉమేశ్ యాదవ్ రెండు, జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీశారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 162 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు 335 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో సఫారీలను కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ఫాలో ఆన్‌కు ఆహ్వానించాడు.

మూడో టెస్టులో కూడా ఫాలోఆన్

దీంతో మూడో టెస్టులో దక్షిణాఫ్రికాకు మళ్లీ ఫాలోఆన్‌ ముప్పు తప్పలేదు. పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో కూడా దక్షిణాఫ్రికాను విరాట్ కోహ్లీ ఫాలో ఆన్ ఆడించిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా... షమీ, నదీమ్, రవీంద్ర జడేజాలు తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Story first published: Monday, October 21, 2019, 17:34 [IST]
Other articles published on Oct 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X