న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ Vs దక్షిణాఫ్రికా 5వ వన్డే మ్యాచ్ హైలెట్స్: వీడియోల రూపంలో

India vs South Africa 5th ODI in Port Elizabeth Highlights - Rohit and Kuldeep Steal Show in Historic Win

హైదరాబాద్: ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా 1992 నవంబరు మొదలు.. 25 ఏళ్లుగా టీమిండియా సఫారీ పర్యటనకు వెళ్తోంది. ఇప్పటివరకు ఏడు టెస్టు సిరిస్‌లు, ఏడు వన్డే సిరీస్‌లు ముగిశాయి. కానీ, ఏ ఫార్మాట్‌లోనూ సిరీస్ విజయం సాధించలేదు. అయితే ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

సఫారీ సేనపై..:

కోహ్లీసేన భారత అభిమానుల కలను నెరవేర్చింది. సఫారీ గడ్డపై కోహ్లీసేన తొలిసారి వన్డే సిరిస్‌ను నెగ్గి చరిత్ర సృష్టించింది. పోర్ట్ ఎలిజబెత్‌లో మంగళవారం జరిగిన ఐదో వన్డేలో సఫారీ జట్టును 73 పరుగులతో ఓడించి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవడంతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.

స్టేడియం బయటపడ్డ బంతి: రబాడ బౌలింగ్‌లో రోహిత్ శర్మ భారీ సిక్సర్

చివరి వన్డేలో భారత జట్టు ఓడినా ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. కెప్టెన్‌గా 48 వన్డే మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన కోహ్లీకి ఇది 37వ విజయం. అంతకాదు టీమిండియా వరుసగా 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను గెలుచుకొంది. వరుసగా 14 సిరీస్‌లను కైవసం చేసుకున్న రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది.

దమ్ము చూపించి దుమ్ము లేపారు:

ఈ సిరిస్‌లో చివరిదైన ఆరో వన్డే సెంచూరియన్‌ వేదికగా శుక్రవారం జరగనుంది. సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేనపై భారత మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పశంసల జల్లు కురిపిస్తున్నారు.

తన సత్తా చూపించాడు:

సఫారీ పర్యటనలో తొలి టెస్టులో బ్యాట్‌తో మెరిసిన పాండ్యా ఆ తరువాత చెప్పుకోదగిన ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఆరు వన్డేల సిరిస్‌లో కూడా అటు బౌలింగ్‌తో పాటు ఇటూ బ్యాటింగ్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. అయితే మంగళవారం జరిగిన ఐదో వన్డేలో బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన పాండ్యా అద్భుతమైన ఫీల్డింగ్‌తో మెరిశాడు. హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన ఆమ్లా.. సఫారీ జట్టుని విజయపథంలో నడిపిస్తోన్న వేళ హార్దిక్ పాండ్యా అద్భుతం చేశాడు.

కుల్‌దీప్‌, ధోనీ ఇద్దరూ కలిసి:

ఆ ఓవర్‌లోని ఐదో బంతి‌ని ఆఫ్ట్ స్టంప్‌కి వెలుపలగా ప్లైటెడ్ డెలివరీ రూపంలో కుల్దీప్ విసరగా.. క్రీజు వెలుపలికి వచ్చి మరో సిక్స్ కొట్టేందుకు క్లాసెన్ ప్రయత్నించాడు. కానీ.. బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని క్లాసెన్ బ్యాట్‌కి అందకుండా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో బంతిని అందుకున్న ధోనీ.. క్షణాల వ్యవధిలోనే వికెట్లని గీరాటేశాడు. స్టంపౌట్ ప్రమాదాన్ని పసిగట్టి క్లాసెన్ వెనక్కి చూడగా.. అప్పటికే బెయిల్స్ ఎగరగొట్టిన ధోనీ.. వికెట్లపై నుంచి దూకుతూ అతనికి కనిపించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 14, 2018, 17:12 [IST]
Other articles published on Feb 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X