న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్లాసన్ కొట్టిన షాట్.. మార్క్రమ్ పట్టిన క్యాచ్.. ఇవే ఇప్పుడు వైరల్

 India vs South Africa, 4th ODI: Heinrich Klaasen Steps Outside The Pitch To Hit Yuzvendra Chahal For Four

హైదరాబాద్: వరుసగా మూడు వన్డేలలో విజయం సాధించిన భారత జట్టుకు నాలుగో వన్డేలో పరాజయం ఎదురైంది. దీనికి వర్షం పడటంతో బైలర్ల ప్రతాపం చూపించుకునేందుకు అవకాశం దొరకలేదు. ఇదొక కారణం అయితే సఫారీ జట్టు బ్యాట్స్‌మెన్‌లు రెచ్చిపోయి ఆడటం మరో కారణం. టీమిండియాతో ఇక్కడ జరిగిన నాల్గో వన్డేలో మెరుపులాంటి ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాను గెలిపించిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఇప్పుడు హీరోగా మారిపోయాడు.

క్లాసెన్ 27 బంతుల్లో 43 పరుగులు సాధించి సఫారీలకు సునాయాస విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంచితే, ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో భారత స్పిన్నర్‌ చాహల్ హాఫ్ స్టంప్ అవతలికి షార్ట్ పిచ్ బంతిని విసిరాడు. దానిని స్వేర్‌లెగ్ వైపు బౌండరీగా మలిచిన తీరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో చర్చగా మారింది.

ఆ షాట్ అచ్చు డివిలియర్స్‌లా ఆడాడని కొందరంటే, మరికొందరేమో క్రేజీ షాట్ అంటున్నారు. సోషల్ మీడియాలో క్లాసెన్ షాట్‌పైనే చర్చ జరుగుతోంది. తన కెరీర్‌లో రెండో వన్డే ఆడిన క్లాసెన్..ఈ వినూత్నమైన షాట్లకు పేరేంటని అడిగితే, అవి బౌండరీ కోసం ప్రత్యేక సందర్భంలో ఆడిన షాట్లన్నాడు.

గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన డికాక్ బదులుగా క్లాసన్ ఆడుతున్నాడు. మ్యాచ్ అనంతరం క్లాసెన్ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీ ఒక సందర్భంలో స్పిన్నర్లను ఎందుకు పక్కన పెట్టాడో అర్థం కాలేదని, ఇలా చేసి కోహ్లీ తనని ఆశ్యర్యానికి గురిచేశాడని పేర్కొన్నాడు. వన్డే సిరీస్ మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే కానీ, భారత స్పిన్నర్లకి మేమూ అలవాటు పడిపోయామని క్లాసెన్ వివరించాడు.

గాల్లో నిల్చొని క్యాచ్ అందుకున్న మార్‌క్రమ్
రబాడ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య ఎక్స్‌ట్ర్ కవర్ మీదుగా షాట్ ఆడాడు. మామూలుగా అయితే బంతి ఫీల్డర్‌ను దాటి బౌండరీకి వెళ్లేదే. కానీ మర్కరమ్ అద్భుతం చేశాడు. అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో కష్ట సాధ్యమైన క్యాచ్‌ను అందుకున్నాడు. నమ్మలేని రీతిలో మర్కరమ్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో పాండ్య నిష్క్రమించాడు. అత్యద్భుత రీతిలో బంతిని అందుకున్న సఫారీ ఫీల్డర్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 12, 2018, 19:13 [IST]
Other articles published on Feb 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X