న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ టీ20: పాక్‌పై భారత్ విజయం, మిథాలీపై ట్విట్టర్‌లో ప్రశంసల జోరు

ICC Women's T20 World Cup, IND VS PAK : Twitterati Praise Team India | Oneindia Telugu
India vs Pakistan Women’s T20: Twitterati praise Mithali Raj for ‘her class and experience’

గుయానా: కరేబియన్ దీవుల్లో జరుగుతున్న మహిళల వరల్డ్ టీ20లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన భారత మహిళల జట్టు ఆదివారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై అలవోక విజయాన్ని నమోదు చేసింది.

గుయానా వేదికగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ మిథాలీ రాజ్‌ హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులే చేసింది. పాక్ నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి అందుకుంది.

భారత మహిళల జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్‌కు పది పరుగుల పెనాల్టీ పడటంతో లక్ష్యం మరింత చిన్నదిగా మారింది. హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన మిథాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శనపై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

టోర్నీలో భాగంగా బుధవారం జరగనున్న తన తర్వాతి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఐర్లాండ్‌తో తలపడనుంది.

వీరేంద్ర సెహ్వాగ్‌

భారత్‌కు మంచి విజయం దక్కింది. అమ్మాయిలు చాలా బాగా ఆడారు. మిథాలీరాజ్‌ అద్భుత ప్రదర్శన కనబర్చింది. బౌలర్లు కూడా చెలరేగిపోయారు. తర్వాతి మ్యాచ్‌ల్లోనూ ఇదే ఉత్సాహంతో దూసుకెళ్లాలి.

సచిన్ టెండూల్కర్

భారత క్రికెట్‌కు ఇది చాలా మంచి రోజు. ఒకే రోజు వెస్టిండిస్‌, పాకిస్థాన్‌పై భారత జట్లు విజయం సాధించాయి.

వీవీఎస్ లక్ష్మణ్

పాక్‌పై అద్భుతమైన విజయం సాధించిన భారత మహిళల జట్టుకు అభినందనలు. బౌలర్లు ఉత్తమ ప్రదర్శన చేశారు. ఇక మిథాలీ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది.

హర్భజన్‌ సింగ్‌

వెల్‌డన్‌ టీమిండియా. మిథాలీరాజ్‌, మొత్తం జట్టుకు అభినందనలు. టోర్నీలో ఆడేబోయే మిగతా మ్యాచ్‌ల్లో కూడా ఇదే ఉత్సాహంతో కొనసాగండి.

మహ్మద్‌ షమీ

టీ20 వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు అద్భుతమైన విజయం సాధించింది. టైటిల్‌ కోసం మరో అడుగు ముందుకేశారు.

మహ్మద్‌ కైఫ్‌

అనుభవాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. ఈ విషయాన్ని మిథాలీరాజ్‌ మరోసారి నిరూపించింది. పాకిస్థాన్‌పై విజయం సాధించిన మహిళల జట్టుకు అభినందనలు.

Story first published: Monday, November 12, 2018, 14:43 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X