న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3rd ODIలో మెరిసిన షమీ, పాండ్యా: టీమిండియా విజయ లక్ష్యం 244

India Vs New Zealand : Mohammed Shami Hardik Pandya Star As India Bowl Out New Zealand For 243
India vs New Zealand, 3rd ODI: Mohammed Shami, Hardik Pandya Star As India Bowl Out New Zealand For 243

హైదరాబాద్: మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా సోమవారం ఆతిత్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో రాస్‌ టేలర్ (93), టామ్ లాథమ్ (51) రాణించడంతో కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది.

Lucky Charm! కేదార్ జాదవ్ జట్టులో ఉంటే టీమిండియాకు విజయమే!Lucky Charm! కేదార్ జాదవ్ జట్టులో ఉంటే టీమిండియాకు విజయమే!

దీంతో పర్యాటక జట్టైన టీమిండియాకు 244 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ(3/41), భువనేశ్వర్ కుమార్(2/46), హార్డిక్ పాండ్యా(2/45), యజువేంద్ర చాహల్(2/51) విజృంభించారు.

1
44082
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మున్రో(7) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై కాసేపటికి గప్టిల్‌(13) కూడా ఔటయ్యాడు. దాంతో 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కివీస్‌ కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(28) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

పాండ్యూ సూపర్ క్యాచ్

పాండ్యూ సూపర్ క్యాచ్

అయితే, చాహల్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా అద్భుత క్యాచ్‌ పట్టడంతో కెప్టెన్ విలియమ్సన్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో న్యూజిలాండ్ మెరుగైన స్థితిలో నిలిపింది. 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్(81), టామ్ లాథమ్(51) ఆదుకున్నారు.

నాలుగో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం

నాలుగో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం

ఈ జోడీ నాలుగో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే ముందుగా రాస్ టేలర్‌ హాఫ్‌ సెంచరీ చేయగా, లాథమ్‌ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 62 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత లాథమ్‌ నాలుగో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. భారత స్పిన్నర్‌ చహల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన లాథమ్‌.. అంబటి రాయుడుకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

20 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన కివీస్

20 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన కివీస్

మరో 13 పరుగుల వ్యవధిలో హెన్రీ నికోలస్‌(6)ను హార్దిక్‌ పాండ్యా ఔట్‌ చేశాడు. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్యా వేసిన మరో ఓవర్‌లో శాంటర్న్‌ పెవిలియన్‌ చేరాడు. దాంతో 20 పరుగుల వ్యవధిలో కివీస్‌ మూడు వికెట్లను చేజార్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతుండటంతో స్కోరును పెంచే బాధ్యత రాస్ టేలర్‌పై పడింది.

సెంచరీ మిస్ చేసుకున్న రాస్ టేలర్

సెంచరీ మిస్ చేసుకున్న రాస్ టేలర్

దీంతో సెంచరీకి చేరువగా వచ్చిన రాస్ టేలర్ ఏడో వికెట్‌గా మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. చివర్లో ఒత్తిడికి గురైన ఆ జట్టు ఆఖర్లో వరుసగా వికెట్లు సమర్పించుకుంది. దీంతో 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు సాధించగా, హార్దిక్‌ పాండ్యా, చహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీశారు.

Story first published: Monday, January 28, 2019, 11:47 [IST]
Other articles published on Jan 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X