న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌గా గంగూలీ రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ

By Nageshwara Rao
India VS England 3rd Test : Virat Kohli Completes 10 Years Of His Journey In Test
India vs England: Virat Kohli Surpasses Sourav Ganguly To Become Highest Scoring India Test Captain Overseas

లండన్: ప్రస్తుతం సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లాండ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత జట్టు కెప్టెన్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న సౌరవ్ గంగూలీని కోహ్లీ వెనక్కి నెట్టాడు.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ప్రస్తుతం కోహ్లీసేన ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తలపడుతుంది. ఈ మూడో టెస్టులో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకు గంగూలీ 1,693 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

 మూడో టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లీ

మూడో టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లీ

మూడో టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లీ.. గంగూలీ కంటే 59 పరుగుల వెనుకంజలో ఉన్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 97 పరుగులతో తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయితే, కెప్టెన్‌గా విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనతను సాధించాడు.

గంగూలీని వెనక్కినెట్టి కోహ్లీ

గంగూలీని వెనక్కినెట్టి కోహ్లీ

ఈ క్రమంలో గంగూలీని వెనక్కినెట్టి కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. గంగూలీ 28 టెస్టుల ద్వారా ఈ పరుగులు చేయగా... కోహ్లీ కేవలం 19 టెస్టుల ద్వారానే ఈ ఘనత అందుకున్నాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ(1,591, 30 టెస్టులు) మూడో స్థానంలో ఉన్నాడు.

మూడో టెస్టులో పట్టు బిగించిన కోహ్లీసేన

మూడో టెస్టులో పట్టు బిగించిన కోహ్లీసేన

ఆ తర్వాతి స్థానాల్లో మహమ్మద్‌ అజహరుద్దీన్‌ (1,717), రాహుల్‌ ద్రవిడ్‌ (1,219)లు ఉన్నారు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో కోహ్లీసేన పట్టు బిగించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన టీమిండియా, ఆతిథ్య ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే ఆలౌట్ చేసింది.

 భారత్‌ 292 పరుగుల ఆధిక్యంలో

భారత్‌ 292 పరుగుల ఆధిక్యంలో

దీంతో, రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 292 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజైన ఆదివారం భారత బ్యాట్స్‌మెన్ భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌కు ఇచ్చి, మన బౌలర్లు మరోసారి సత్తా చాటితే మ్యాచ్‌ మన సొంతం అవడం ఖాయం. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇంగ్లాండ్ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది.

1
42376
Story first published: Monday, August 20, 2018, 13:58 [IST]
Other articles published on Aug 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X