న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ.. బ్యాట్స్‌మన్‌గా ఓకే.,. కెప్టెన్‌గా ఇంకా..!

India vs England: Virat Kohli misses trick as spinners are rendered ineffective

హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లలోనూ టాప్ ర్యాంకింగ్స్‌లో కొలువుదీరిన కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, కెప్టెన్సీ విషయంలో మాత్రం మరింత పదునెక్కాల్సిన అవసరం చాలా ఉంది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తానొక్కడై పరుగులు సాధించి ముందుకు నడిపించేంత వరకు బాగానే ఉంది. తుది జట్టు ఎంపిక, కూర్పు విషయంలో అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

 ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగి మరోసారి అదే పని

ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగి మరోసారి అదే పని

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా పుజారాను పక్కనబెట్టి ఆశ్చర్యపరిచిన కోహ్లి.. లార్డ్స్ టెస్టుకి ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగి మరోసారి అదే పని చేశాడు. లార్డ్స్ టెస్టులో ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగడం సరైన వ్యూహమని కోహ్లి భావించాడు. పిచ్ పొడిగా ఉండటంతో.. స్పిన్నర్లు కీలకం అవుతాడనుకుని బోల్తా కొట్టించాడు. కానీ మ్యాచ్ ఆరంభమయ్యేలోగా వర్షం కురవడంతో.. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

 బౌలర్లు ఆరంభంలో వికెట్లు తీసినప్పటికీ..

బౌలర్లు ఆరంభంలో వికెట్లు తీసినప్పటికీ..

పిచ్ సీమర్లకు అనుకూలించడంతో భారత్ 107 పరుగులకే కుప్పకూలింది. తర్వాత మన బౌలర్లు ఆరంభంలో వికెట్లు తీసినప్పటికీ.. తర్వాత నెమ్మదించారు. నాలుగో పేస్ బౌలర్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌ను చుట్టేసినట్టే మన పేస్ అటాక్ లార్డ్స్‌లోనూ చేసేది. ఉమేశ్ బదులు కుల్దీప్‌ను జట్టులోకి తీసుకోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడటం బౌలర్లకు కష్టమైంది.

3 గంటల ముగిశాక కానీ బౌలింగ్‌కు దిగలేక:

3 గంటల ముగిశాక కానీ బౌలింగ్‌కు దిగలేక:

ఎడ్జ్‌బాస్టన్‌లో సత్తా చాటిన అశ్విన్‌ లార్డ్స్‌లో మూడు గంటల ఆట ముగిశాక కానీ బౌలింగ్‌కు దిగలేకపోయాడు. కుల్దీప్ అంతకుముందే 4 ఓవర్లు వేసినా ఉపయోగం లేకపోయింది. లార్డ్స్ పిచ్ మీద అదనపు పేసర్ అవసరం. జట్టులో ఉమేష్ ఉండి ఉండాల్సిందని సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. 2002లో జరిగిన హెడింగ్లీలో టెస్టులో కుంబ్లే, హర్భజన్లతో గంగూలీ బరిలో దిగాడు. ఆ మ్యాచ్‌లో వీరిద్దరూ 11 వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించారు.

పరిస్థితులు పేసర్లకు అనుకూలిస్తాయని భజ్జీ:

పరిస్థితులు పేసర్లకు అనుకూలిస్తాయని భజ్జీ:

లార్డ్స్‌లో కుల్దీప్ బదులు ఇషాంత్‌కు స్థానం కల్పించి ఉంటే బాగుండేదని ఇంగ్లాండ్ గడ్డ మీద ఆడిన అనుభవంతో గంగూలీ చెప్పాడు. బర్మింగ్‌హమ్‌లో ఇద్దరు స్పిన్నర్లు అవసరం, ఇక్కడ కాదని దాదా తెలిపాడు. లార్డ్స్‌లోని పరిస్థితులు పేసర్లకు అనుకూలిస్తాయని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కోహ్లి గతంలో ఎన్నో సరైన పనులు చేశాడు. ఈసారి తప్పిదం చేయొచ్చు. బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కింద వదిలేయడం మంచిదని గంగూలీ తెలిపాడు. .

1
42375
Story first published: Sunday, August 12, 2018, 16:49 [IST]
Other articles published on Aug 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X