న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పింక్ బాల్ టెస్ట్: మరో అరుదైన రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ

IND vs BAN,2nd Test : Virat Kohli on the verge of achieving unique milestone as captain
India vs Bangladesh, Pink Ball: Virat Kohli needs 32 rund to reach 5000 runs as captain

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా మరో రికార్డుకి చేరువయ్యాడు. బంగ్లాతో శుక్రవారం ఆరంభమయ్యే పింక్‌ బాల్‌ టెస్టులో కోహ్లీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోనున్నాడు. భారత్ తరుపున ఐదువేల పరుగు మైలురాయిని అందుకున్న తొలి కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు.

పింక్ బాల్ టెస్టులో కోహ్లీ గనుక మరో 32 పరుగులు చేస్తే ఈ ఘనత సాధిస్తాడు. భారత్ తరుపున ఇప్పటి వరకు 83 టెస్టులు ఆడిన కోహ్లీ 7,066 పరుగులు చేశాడు. అయితే, కెప్టెన్‌గా టెస్టుల్లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 32 పరుగులు దూరంలో ఉన్నాడు.

పింక్ బాల్ టెస్ట్‌లో అందరి దృష్టి సంధ్య వెలుగుపైనే: ఆ రెండు గంటలే ముఖ్యమంటున్న క్రికెట్ విశ్లేషకులు!పింక్ బాల్ టెస్ట్‌లో అందరి దృష్టి సంధ్య వెలుగుపైనే: ఆ రెండు గంటలే ముఖ్యమంటున్న క్రికెట్ విశ్లేషకులు!

32 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ

32 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ

భారత్ తరుపున ఇప్పటివరకు 52 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కోహ్లీ 4,968 పరుగులు చేశాడు. మరో 32 పరుగులు చేస్తే టెస్టుల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న కెప్టెన్ల జాబితాలో చేరతాడు. అంతేకాదు భారత్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా నిలుస్తాడు.

ఐదువేల పరుగుల మైలురాయిని

ఐదువేల పరుగుల మైలురాయిని

అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో కెప్టెన్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో గ్రేమ్‌ స్మిత్‌(8,659) అగ్రస్థానంలో ఉండగా అలెన్‌ బోర్డర్‌(6,623), రికీ పాంటింగ్‌(6,542), క్లైవ్‌ లాయిడ్‌(5,233), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(5,156)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

తొలి టెస్టులో డకౌట్

తొలి టెస్టులో డకౌట్

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ డకౌటైన సంగతి తెలిసిందే. రెండు బంతులు మాత్రమే ఆడి పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. కోహ్లీ విఫలమైనప్పటికీ తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ రాణించడంతో భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

Captain Games Innings Runs
1 Graeme Smith 109 193 8659
2 Allan Border 93 154 6623
3 Ricky Ponting 77 140 6542
4 Clive Lloyd 74 111 5233
5 Stephen Fleming 80 80 5156
6 Virat Kohli 52 85 4968
Story first published: Thursday, November 21, 2019, 14:48 [IST]
Other articles published on Nov 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X