న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మయాంక్ డబుల్ సెంచరీ: రెండోరోజు ముగిసిన ఆట.. భారత్ 493/6, ఆధిక్యం 343

India vs Bangladesh: Mayank Agarwal 243, Ajinkya Rahane 86 give India massive lead

హైదరాబాద్: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో శుక్రవారం పరుగుల వరద పారింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 493 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 343 పరుగుల ఆధిక్యం లభించింది.

ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (76 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉమేష్‌ యాదవ్‌ (10 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులతో ఉన్నారు. శుక్రవారమైన రెండోరోజు భారత బ్యాట్స్‌మెన్ 400 పరుగులు చేయడం విశేషం. బంగ్లా బౌలర్లలో జాయేద్‌ నాలుగు వికెట్లు తీయగా, ఎబాదత్‌ హొసేన్‌, మెహిదీ హసన్‌ తలో వికెట్‌ తీశారు.

కీలక భేటీకి డుమ్మా: జిలేబీ తింటూ గంభీర్ భలేగా దొరికిపోయాడే, తీవ్ర విమర్శలు!కీలక భేటీకి డుమ్మా: జిలేబీ తింటూ గంభీర్ భలేగా దొరికిపోయాడే, తీవ్ర విమర్శలు!

86/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో

86/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో

86/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో శుక్రవారం ఆటను ప్రారంభించిన పుజారా-మయాంక్ రెండో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పుజారా(54) హాఫ్‌ సెంచరీ తర్వాత పెవిలియన్‌ చేరగా, మయాంక్‌ అగర్వాల్ మాత్రం హాఫ్ సెంచరీని సెంచరీగా మలిచాడు. పుజారా ఔటైన తర్వాత అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు.

నిరాశ పరిచిన విరాట్ కోహ్లీ

నిరాశ పరిచిన విరాట్ కోహ్లీ

జాయేద్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకొచ్చిన రహానే మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి మంచి భాగస్వామాన్ని నమోదు చేశాడు. ఈక్రమంలో మయాంక్‌ సెంచరీ సాధించగా రహానే (172 బంతుల్లో 86; 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 190 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

భారీ సిక్సర్‌తో మయాంక్ డబుల్ సెంచరీ

టీ విరామం అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి మయాంక్‌ స్కోరుబోర్డులో వేగం పెంచాడు. ఈ క్రమంలో భారీ సిక్సర్‌తో రెండో డబుల్ సెంచరీని సాధించాడు. 12 ఇన్నింగ్స్‌ల్లోనే మయాంక్ రెండు డబుల్ సెంచరీలు సాధించి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మయాంక్ ప్రదర్శనపై కెప్టెన్ కోహ్లీ సంతోషంగా ఉన్నాడు.

ట్రిపుల్ సెంచరీ చేయాలన్న కోహ్లీ

డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని అనంతరం ఆకాశం వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు బ్యాట్‌ చూపిస్తూ అభివందనం చేశాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌ వైపు చూస్తూ డబుల్ సెంచరీ చేశానని చేతివేళ్లతో కెప్టెన్‌ కోహ్లీకి సైగలు చేశాడు. చిరునవ్వుతో స్పందించిన కెప్టెన్ కోహ్లీ మూడు వేళ్లను చూపిస్తూ ట్రిపుల్ సెంచరీ బాదాలని సూచించాడు.

243 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మయాంక్ ఔట్

ట్రిపుల్ సెంచరీ చేయాలన్న కసితో దూకుడుగా ఆడే క్రమంలో యమాంక్ అగర్వాల్ 243 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. మెహదీ హసన్‌ బౌలింగ్‌లో జయేద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో జడేజాతో 123 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్‌ సాహా (12) నిరాశపరిచాడు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 343 పరుగుల ఆధిక్యం

చివర్లో నైట్‌ వాచ్‌‌మెన్‌‌గా ఉమేశ్‌ యాదవ్‌‌ని బరిలోకి దించడంతో 10 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులతో చెలరేగాడు. అదే సమయంలో జడేజా హాఫ్ సెంచరీతో రాణించడం... శుక్రవారం ఆట ముగిసే సరికి టీమిండియా 493/6 పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 343 పరుగుల ఆధిక్యంలో లభించింది.


=

Story first published: Friday, November 15, 2019, 18:35 [IST]
Other articles published on Nov 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X