న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకో.. నువ్వెంటో నిరూపించుకో!!

Gambhir Tells Sanju Samson 'Grab Your Moment' Ahead Of Bangladesh T20Is || Oneindia Telugu
India vs Bangladesh: Grab your moment, Gautam Gambhir tells Sanju Samson

ఢిల్లీ: జాతీయ జట్టులో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకో. నువ్వెంటో నిరూపించుకో అని టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్‌కు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సూచించారు. గురువారం ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమీటి బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి విశ్రాంతినివ్వగా.. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.

అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ .. తమిళనాడు ఆలౌట్.. కర్ణాటక లక్ష్యం 253అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ .. తమిళనాడు ఆలౌట్.. కర్ణాటక లక్ష్యం 253

టీ20 సిరీస్‌లో చోటు:

టీ20 సిరీస్‌లో చోటు:

దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన ఆటగాళ్లకు సెలక్షన్‌ కమిటీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ లోపాలతో జట్టుకు దూరమయిన శాంసన్‌.. విజయ్‌ హజారే ట్రోఫీలో 212 పరుగులతో సత్తా చాటాడు. దీంతో 4 ఏళ్ల తర్వాత టీమిండియా నుంచి అతనికి మళ్లీ పిలుపొచ్చింది. బంగ్లాదేశ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శాంసన్‌కు చోటు దక్కింది. చివరగా అతడు 2015లో జింబ్వాబేలో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు.

 నువ్వెంటో నిరూపించుకో:

నువ్వెంటో నిరూపించుకో:

టీ20 సిరీస్‌లో శాంసన్‌ ఎంపికవడంతో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. చాలా కాలంగా సంజు శాంసన్‌ను జాతీయ జట్టులోకి ఎంపిక చేయాలని గంభీర్ అంటున్న విషయం తెలిసిందే. చివరకు తన మాట నెగ్గడంతో ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసాడు. అంతేకాదు శాంసన్‌కు ఓ సూచన కూడా చేసాడు. 'శాంసన్‌ చాలా గ్యాప్ తర్వాత అవకాశం దక్కించుకున్నాడు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. టీ20 జట్టులో ఎంపికైనందుకు అభినందనలు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకో. నువ్వెంటో నిరూపించుకో' అని రాసుకొచ్చాడు.

సంజు డబుల్ సెంచరీ:

సంజు డబుల్ సెంచరీ:

'దేశీయ వన్డే గేమ్‌లో సంజు డబుల్ సెంచరీ సాధించాడు. మంచి ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ప్రతిభ ఉంటే త్వరగానే అవకాశాలు వస్తాయి' అని గోవాపై 212 పరుగులు చేసిన తర్వాత గంభీర్ ట్వీట్ చేశాడు. ఇటీవలి కాలంలో శాంసన్‌ అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతనికి సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే.. ప్రస్తుతం జట్టులో ఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంకా కుదురుకోలేదు.

ప్రపంచకప్‌ నా కల:

ప్రపంచకప్‌ నా కల:

శాంసన్‌ మాట్లాడుతూ... 'నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రపంచంలోనే అత్యుత్తమమైన భారత జట్టులోకి రావడానికి చాలా కష్టపడ్డాను. జట్టు అవసరాల కోసం టాప్ ఆర్డర్‌, మిడిల్ ఆర్డర్‌ ఎక్కడైనా ఆడుతా. నా దేశం కోసం ప్రపంచకప్‌లో ఆడడం, కప్ గెలవడమే నా కల. అయితే ఇది ఏ సంవత్సరంలో జరుగుతుందో నాకు తెలియదు. ఐదేళ్లలో మానసికంగా, సాంకేతికంగా నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. నా బలాలపై మరింత దృష్టి పెట్టా. ఎప్పుడూ పరిపూర్ణ బ్యాట్స్‌మన్‌ అవ్వాలని ప్రయత్నించలేదు. ఎందుకంటే.. పరిపూర్ణులు ఎవరూ ఉండరు' అని అన్నాడు.

Story first published: Friday, October 25, 2019, 14:18 [IST]
Other articles published on Oct 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X