న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh:తొలి టీ20కి కాలుష్యం సెగ, స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

 India vs Bangladesh: Delhi CM Kejriwal hopes pollution wont affect 1st T20I

హైదరాబాద్: ఢిల్లీ కాలుష్యం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే తొలి టీ20పై ఎటువంటి ప్రభావం చూపదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) తగ్గుముఖం పట్టడంతో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే తొలి టీ20పై అనిశ్చితి నెలకొన్నట్లు వచ్చిన వార్తలపై కేజ్రీవాల్ స్పందించారు.

ఢిల్లీలో గాలి నాణ్యతను పెంచేందుకు సరి-బేసి విధానాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ "క్రికెట్ మ్యాచ్ జరిగే మార్గంలో కాలుష్యం రాదని నేను ఆశిస్తున్నాను. కాలుష్యాన్ని తగ్గించడానికి నవంబర్ 4 నుండి సరి-బేసి పథకాన్ని కూడా అమలు చేస్తున్నాము. ఈ సీజన్‌లో అంతకుముందు కూడా మ్యాచ్‌లు ఆడటం నేను చూశాను. ఢిల్లీలో తప్పక మ్యాచ్ ఆడాలి" అని తెలిపాడు.

ఐపీఎల్‌లో మసాజ్‌ థెరపిస్ట్‌గా నవనీత గౌతమ్‌: ఏమైనా భయాలు ఉన్నాయా?ఐపీఎల్‌లో మసాజ్‌ థెరపిస్ట్‌గా నవనీత గౌతమ్‌: ఏమైనా భయాలు ఉన్నాయా?

మ్యాచ్ నాటికి ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) తగ్గుముఖం పట్టనుందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ బీసీసీఐ, డీడీసీఏలకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే తొలి టీ20 జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. నవంబర్ 3న భారత్‌, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.

"ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నుండి అనుమతి తీసుకున్నాం. నవంబర్ 3న గాలి నాణ్యత మామూలుగానే ఉంటుందని వారు స్పష్టం చేసారు. దీంతో ఢిల్లీలోనే తొలి టీ20 మ్యాచ్ నిర్వహించాలి నిర్ణయించాం. ప్రస్తుతానికి సమస్య పరిష్కరించబడింది. మేము ప్రణాళికలో ఎటువంటి మార్పు చేయం" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మామూలుగానే ఎక్కువగా ఉంటుంది. శీతకాలం సమీపించడం, దీపావళి టపాసులతో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మూడు రోజుల క్రితం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 357గా నమోదైంది. 400 దాటితే తీవ్ర శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

'ఐపీఎల్ ఆడటం మానేయి' - మిస్ పైర్ అయిన రోహిత్ శర్మ దీపావళి ట్వీట్'ఐపీఎల్ ఆడటం మానేయి' - మిస్ పైర్ అయిన రోహిత్ శర్మ దీపావళి ట్వీట్

దీపావళి పండుగ నేపథ్యంలో గాలి నాణ్యత మరింత దిగజారింది. పండగ జరిగిన వారం రోజుల తర్వాత మ్యాచ్‌ ఉండడంతో.. సమస్య తీవ్రత తగ్గుతుందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ స్పష్టం చేసింది. మరోవైపు ఢిల్లీ వాతావరణంతో ఆటగాళ్లు అస్వస్థతకు గురికాకుండా ఉండడానికి మాస్కులు ధరించేలా చూడాలని డీడీసీఏ భావిస్తోంది.

గతంలో కూడా ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఇక్కడ ఆడిన సందర్భాలు ఉన్నాయి. 2017, డిసెంబర్‌లో శ్రీలంక ఆటగాళ్లు ముఖానికి మాస్క్‌లు ధరించి ఆడారు. అయినా రెండు మూడు సార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. శీతకాలంలో డిల్లీలో మ్యాచ్‌లు నిర్వహించొద్దని ఎప్పటినుండో డిమాండ్లు వినిపిస్తున్నాయి.

పాకిస్థాన్‌కు ఊహించని షాక్: నెదర్లాండ్స్ చేతిలో ఓటమి, టోక్యో ఒలింపిక్స్‌కు దక్కని బెర్తుపాకిస్థాన్‌కు ఊహించని షాక్: నెదర్లాండ్స్ చేతిలో ఓటమి, టోక్యో ఒలింపిక్స్‌కు దక్కని బెర్తు

ఈ రొటేషన్‌ పాలసీ ప్రకారమే తొలి టీ20ని ఢిల్లీకి కేటాయించాల్సి వచ్చింది. పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ జట్టు నేరుగా డిల్లీకి చేరుకుంటుంది. నవంబరు 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రెండో టీ20 మ్యాచ్‌ రాజ్‌కోట్ వేదికగా 7న, ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా 10న జరగనున్నాయి.

అన్ని టీ20 మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకి ప్రారంభం కానున్నాయి. నవంబరు 14న నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు.. నవంబర్ 22 నుంచి కోల్‌కతా వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.

భారత్‌లో బంగ్లా పర్యటన పూర్తి షెడ్యూల్, టైమింగ్స్:
1st T20I - New Delhi (November 3) - 7:00 PM (IST)
2nd T20I - Rajkot (November 7) - 7:00 PM (IST)
3rd T20I - Nagpur (November 10) - 7:00 PM (IST)

1st Test - Indore (November 14-18) - 9:30 AM (IST)
2nd Test - Kolkata (November 22-26) - 9:30 AM (IST)

TV Channels: Star Sports Network
Live Streaming: HotStar.com

Story first published: Monday, October 28, 2019, 19:00 [IST]
Other articles published on Oct 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X