న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: ఉప్పల్‌లో ఆ 12 ఏళ్ల రికార్డుని కోహ్లీసేన బద్దలు కొట్టేనా?

India VS Australia 2019 : Virat Kohli Look To Halt Australia’s 12-year-old Record In Hyderabad
India vs Australia: Virat Kohli & Co look to halt Australia’s 12-year-old record in Hyderabad

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే శనివారం ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. భారత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు తన పర్యటనల్లో ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు గెలిస్తే, భారత్‌ 25 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించగలిగింది. ఐదింట్లో ఫలితం తేలలేదు. ఉప్పల్ స్టేడియం ఆస్ట్రేలియాకు ఎంతగానొ కలిసొచ్చిన స్టేడియం. ఆస్ట్రేలియా గతంలో ఇక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఒక్కసారీ ఓడిపోలేదు.

47 పరుగుల తేడాతో ఓడిన భారత్

47 పరుగుల తేడాతో ఓడిన భారత్

2007లో టీమిండియాను ఆస్ట్రేలియా 47 పరుగుల తేడాతో ఓడించింది. మరో రెండేళ్ల తర్వాత జరిగిన మ్యాచ్‌లో షాన్‌మార్ష్‌ సెంచరీ సాధించడంతో ఆసీస్ మూడు పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తొలి వన్డేను కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టీ20 సిరిస్‌ను 0-2తో చేజార్చుకున్న టీమిండియా వన్డే సిరిస్‌ను గెలుపుతో ఆరంభించాలని భావిస్తోంది.

ఉప్పల్‌లో రికార్డుని మెరుగుపరచుకోవాలని

ఉప్పల్‌లో రికార్డుని మెరుగుపరచుకోవాలని

దీంతో పాటు ఉప్పల్ స్టేడియంలో తమకు రికార్డుని మెరుగు పరచుకోవాలని కోహ్లీసేన గట్టి పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియాతో చివరగా తలపడిన ఏడు వన్డేల్లో భారత క్రికెట్ జట్టు ఆరింట విజయం సాధించింది. దీంతో ఉప్పల్‌ మైదానంలో 12 ఏళ్ల రికార్డును కోహ్లీసేన బద్దలు చేస్తుందేమో చూడాలి. మరోవైపు తొలి వన్డేలో టీమిండియా మాజీ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడటంపై అనుమానం నెలకొంది.

తొలి వన్డేకు ధోని అనుమానమే!

తొలి వన్డేకు ధోని అనుమానమే!

ఆసీస్‌తో జరగబోయే తొలి వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ధోని గాయపడ్డాడు. నెట్స్‌లో ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో సపోర్ట్ స్టాఫ్ సభ్యుడైన రాఘవేంద్ర విసిరిన బంతి ధోని కుడి చేతికి బలంగా తాకింది. అనంతరం వెంటనే ధోని విపరీతమైన నొప్పితో విలవిల్లాడు. అప్పటికే చాలా సేపటి నుంచి నెట్స్‌ లో ప్రాక్టీస్ చేస్తున్న ధోని.... గాయపడిన వెంటనే ముందు జాగ్రత్తగా నెట్స్ నుంచి వెళ్లిపోయాడు.

ధోని స్థానంలో రిషబ్ పంత్!

ధోని స్థానంలో రిషబ్ పంత్!

అయితే, ధోనికి అయిన గాయం తీవ్రత మాత్రం తెలియరాలేదు. తొలి వన్డేలో ధోని ఆడతాడా లేదా అన్నది శుక్రవారం సాయంత్రంలోగా తేలనుంది. ఒకవేళ తొలి వన్డేకి ధోని దూరమైతే అతడి స్థానంలో రిషబ్ పంత్‌‌కు తుది జట్టులో చోటు కల్పించాలనే ఆలోచనలో జట్టు మేనేజ్‌మెంట్ ఉంది. భారత కాలమానం ప్రకారం తొలి వన్డే మధ్యాహ్నాం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.

Story first published: Friday, March 1, 2019, 17:30 [IST]
Other articles published on Mar 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X