న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్ టెస్ట్, డే 2: ఈ పిచ్‌పై నాథన్ లియాన్ ఎంజాయ్ చేస్తాడు

India vs Australia: Nathan Lyon will enjoy bowling with amount of bounce at Perth, reckons Aaron Finch

హైదరాబాద్: పెర్త్ వేదికగా భారత జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు హోరాహోరీగానే ఉండబోతోందని ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఆరోన్ ఫించ్‌ అన్నాడు. పెర్త్ పిచ్ బౌన్స్‌కు బాగా సహకరిస్తుండటంతో స్పిన్నర్‌ నాథన్ లియాన్ కీలకంగా మారుతాడని ఆరోన్ ఫించ్ తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో మార్కస్‌ హ్యారిస్‌తో కలిసి ఆరోన్ ఫించ్‌ (50) తొలి వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం అందించాడు.

 ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ

ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ

ఆస్ట్రేలియా గడ్డపై ఆరోన్ ఫించ్‌కు టెస్టుల్లో ఇదే మొట్టమొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. తొలిరోజు మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ "రెండు జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేయడం కలిసొచ్చింది. మేం మంచి స్థితిలో ఉన్నాం. ఈ ట్రాక్‌పై ఇంత బౌన్స్‌ ఉందంటే నాథన్ లియాన్ కచ్చితంగా బౌలింగ్‌ను ఎంజాయ్ చేస్తాడు" అని అన్నాడు.

బౌన్స్‌కు సహకరించే పిచ్‌పై

బౌన్స్‌కు సహకరించే పిచ్‌పై

"బౌన్స్‌కు సహకరించే ఈ పిచ్‌పై బౌలింగ్ చేసేందుకు లియాన్ ఆతృతతో ఉన్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. పెర్త్ టెస్ట్‌లో ప్రణాళిక ప్రకారం బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఇందులో భాగంగా తొలుత ఆచితూచి ఆడాం. తర్వాత పుంజుకొని పరుగులు రాబట్టాం. మూడు, నాలుగో రోజు ఇది కీలకమవుతుంది. యువ ఓపెనర్ హ్యారిస్ అద్భుత ప్రతిభ గల ఆటగాడు" అని ఫించ్ అన్నాడు.

పాంటింగ్‌తో మాట్లాడటం ఉపయోగపడింది

పాంటింగ్‌తో మాట్లాడటం ఉపయోగపడింది

"పరిస్థితులకు తగ్గట్లు ఆటతీరును మార్చుకుంటూ జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. పిచ్‌ను, పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. అందుకు అనుగుణంగా బ్యాటింగ్‌ చేశాడు. షెఫీల్డ్‌ షీల్డ్‌లో మేమిద్దరం విక్టోరియా తరఫున కలిసి ఆడాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది. టెస్టుకు ముందు పాంటింగ్‌తో మాట్లాడటం ఉపయోగపడింది. ఆఫ్‌ స్టంప్‌ను కవర్‌ చేయడం, బంతి బాదడం గురించి మాట్లాడాను" అని ఫించ్‌ తెలిపాడు.

పెర్త్ టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభం

పెర్త్ టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభమైంది. 277/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆస్ట్రేలియా రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన గంట తర్వాత టిమ్ పైన్(38) పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగగా, ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌‌లో ప్యాట్ కుమ్మిన్స్ (19) పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 108 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 325/8 స్థితిలో ఉంది. క్రీజులో మిచెల్ స్టార్క్(6), నాథన్ లియాన్(9) పరుగులతో ఉన్నారు.

1
43624
Story first published: Saturday, December 15, 2018, 10:40 [IST]
Other articles published on Dec 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X