న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, రోహిత్ ఇన్, విహారీ అవుట్

India vs Australia 1st Test Day 1: Top Order Collapse | Rohit Sharma Take Stand!!
rohit-In-vihari-out-as-india-elect-to-bat

న్యూ ఢిల్లీ: బోర్డ‌ర్‌-గావ‌స్క‌ర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్టు ఆరంభమైంది. అడిలైడ్ వేదికగా జరగనున్న సమరంలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ గడ్డపై టీమిండియా ఇప్పటివరకు టెస్టు సిరిస్‌ను గెలవలేదు. టెస్టు సిరిస్‌ నెగ్గి చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన ఊవిళ్లూరుతోంది.

మరోవైపు, టిమ్ పైన్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు టాప్ ర్యాంక్ టీమిండియా జోరుకు చెక్ పెట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటికే తొలి టెస్టుకు ఇరు దేశాలు త‌మ తుది జ‌ట్ల‌ను ప్రకటించాయి.ఒక రోజు ముందుగా 12మందితో కూడిన జాబితాను విడుదల చేసిన టీమిండియా.. తుది జట్టుకు హనుమవిహారీ, రోహిత్‌లలో ఎవర్ని తీసుకుంటుందనేది ఉత్కంఠను నెలకొంది. కాగా, టాస్ అనంతరం ఆ స్థానంలో రోహిత్ బరిలోకి దిగనున్నట్లు కోహ్లీ తెలిపాడు.

ఇంగ్లాండ్ గడ్డపై బ్యాక్ ఫుట్ ప్లేయర్లకు పిచ్ అనుకూలిస్తుందనే కోణంలో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం వల్ల ముందుగా భారీ స్కోరు దిశగా భారత్ అడుగులేసేందుకు కూడా ఈ నిర్ణయం కారణమవుతుంది. మరో వైపు ఒకే స్పిన్నర్‌(రవి చంద్రన్ అశ్విన్)ను మాత్రమే జట్టులోకి తీసుకున్న టీమిండియా టాస్ ఓడి బౌలింగ్ తప్పనిసరైతే మాత్రం హనుమవిహారీ మరో స్పిన్నర్ రూపంలో తుది జట్టులో కనిపించేవాడేమో!!

భారత్ తుది జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే, మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా తుది జట్టు: మార్కస్‌ హారిస్‌, ఆరొన్‌ ఫించ్‌, ఉస్మాన్‌ ఖవాజ, షాన్‌ మార్ష్‌, ట్రావిస్‌ హెడ్‌, పీటర్‌ హాండ్స్‌కంబ్‌, టిమ్‌ పైన్(సారథి)‌, జాస్‌ హేజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్‌, నాథన్‌ లియాన్‌, మిచెల్‌ స్టార్క్.

Story first published: Thursday, December 6, 2018, 11:33 [IST]
Other articles published on Dec 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X