న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG 1st Test:లంచ్ బ్రేక్..రోహిత్ ఔట్!హాఫ్ సెంచరీకి చేరువలో రాహుల్..భారత్ స్కోర్ ఎంతంటే?

Ind vs Eng Day 2 Session 1: Indian Openers Roasted England Bowlers, Rohit Sharma Out for 36

నాటింగ్‌హామ్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం ఇంగ్లండ్ జట్టుతో ప్రారంభం అయిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజైన గురువారం భోజన విరామ సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయింది. భారత్ 37.3 ఓవర్లలో 97 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ లంచ్ బ్రేక్ ముందే ఔట్ అయ్యాడు. ఓలి రాబిన్‌సన్‌ వేసిన 37వ ఓవర్‌ మూడో బంతికి రోహిత్ (36) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కి భారత్ ఇంకా 86 పరుగులు వెనకంజలో ఉంది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (48) పరుగులతో క్రీజులో ఉన్నాడు.

రెండో రోజు భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్ (9), రోహిత్ శర్మ (9) పరుగులతో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. రెండో రోజు ఆటను భారత్‌ నెమ్మదిగా ఆరంభించింది. అండర్సన్, బ్రాడ్ పిచ్‌ పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుని చెలరేగినా.. రోహిత్, రాహుల్ ఇద్దరూ ఆచితూచి ఆడారు. 3-4 ఓవర్ల పాటు పరుగులు చేయలేదు. క్రీజులో కుదురుకున్నాక స్ట్రైక్ రొటేట్ చేశారు. ఆపై చెత్త బంతులను మాత్రమే బౌండరీలు తరలిస్తూ.. భారత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ముఖ్యంగా రాహుల్ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. రోహిత్ కూడా తనదైన శైలిలో ఫోర్లు బాదాడు.

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మల జోరు చూస్తే.. భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే భోజన విరామ సమయానికి ముందు రోహిత్‌ శర్మ (36; 107 బంతుల్లో 4x6) ఔటయ్యాడు. ఓలి రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి సామ్‌ కరన్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్‌ 97 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. మరోవైపు కేఎల్‌ రాహుల్‌ (48; 124 బంతుల్లో 4x8) అర్ధ శతకానికి చేరువయ్యాడు. ప్రస్తుతం భారత్‌ ఇంగ్లాండ్ కన్నా 86 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి సెషన్లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇక లంచ్ అనంతరం రాహుల్‌కు జతగా చేతేశ్వర్ పుజారా క్రీజులోకి రానున్నాడు. తొలిరోజు స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన భారత్‌.. బ్యాటింగ్‌లో రెండో రోజు మొత్తం నిలబడి ఆడితే భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. భారత పేస్‌ బౌలర్లు తమ ప్రదర్శనతో దుమ్మురేపడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (108 బంతుల్లో 64; 11 ఫోర్లు) మాత్రమే భారత బౌలర్లను ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించాడు. మిగతావారంతా విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రాకు 4 వికెట్లు దక్కగా.. మొహమ్మద్‌ షమీ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.

Tokyo Olympics 2021: స్వర్ణం గెలవకున్నా.. పంజాబ్‌ హాకీ ఆటగాళ్లను వరించిన బంపర్ ఆఫర్!!Tokyo Olympics 2021: స్వర్ణం గెలవకున్నా.. పంజాబ్‌ హాకీ ఆటగాళ్లను వరించిన బంపర్ ఆఫర్!!

Story first published: Thursday, August 5, 2021, 18:08 [IST]
Other articles published on Aug 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X