సెంచరీతో చెలరేగిన గేల్, క్వాలిఫయర్ మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ స్కోరు

Posted By:
ICC World Cup qualifiers 2018: Chris Gayle slams 23rd ODI century against UAE

హైదరాబాద్: వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో సచిన్‌, ఆమ్లాల తర్వాత 11 విభిన్న దేశాలపై శతకాలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడిన గేల్‌ 91 బంతుల్లో 123 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి.

భారీ స్కోరుతో విజేతగా వెస్టిండీస్:
ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో వెస్టిండీస్‌ శుభారంభం చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్‌ 60 పరుగుల తేడాతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పై విజయం సాధించింది. ముందుగా వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. షిమ్రాన్‌ హెట్‌మర్‌ (93), క్రిస్‌ గేల్‌ (91 బంతుల్లో 123) సెంచరీలతో చెలరేగారు. అనంతరం యూఏఈ 50 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేసింది.

రమీజ్‌ షహజాద్‌ (107) సెంచరీతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. షైమాన్‌ అన్వర్‌ 64 పరుగులు సాధించగా...జేసన్‌ హోల్డర్‌ (5/53) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్‌లో జింబాబ్వే 2 పరుగులతో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. ముందుగా జింబాబ్వే 43 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్‌ కాగా... అఫ్గానిస్తాన్‌ 49.3 ఓవర్లలో 194 పరుగులే చేయగలిగింది.

గతంలో గేల్ బాదుడు:
ఈ మ్యాచ్‌లో విండీస్‌ 60 పరుగుల తేడాతో గెలిచింది. ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ల్లో భాగంగా యూఏఈతో జరిగిన ఈ మ్యాచ్‌లో తన సహజశైలిలో చెలరేగిన గేల్‌ 11 దేశాలపై శతకాలు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు సచిన్‌ టెండూల్కర్‌, హషీమ్‌ ఆమ్లా ఈ ఫీట్‌ సాధించారు. బంగ్లాదేశ్‌, కెనడా, ఇంగ్లండ్‌, భారత్‌, కెన్యా, న్యూజిలాండ్‌, పాక్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వేలపై ఇదివరకు గేల్‌ సెంచరీలు సాధించాడు. 38 ఏళ్ల గేల్‌ కెరీర్‌లో ఇది 23వ శతకం.

Story first published: Wednesday, March 7, 2018, 8:35 [IST]
Other articles published on Mar 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి