న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అట్టహాసంగా వరల్డ్‌కప్ ఆరంభ వేడుకలు: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

 ICC World Cup 2019 Opening Ceremony Highlights: Anil Kumble, Viv Richards play 60-second challenge

హైదరాబాద్: క్రికెట్ వరల్డ్‌కప్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గతంలో ఆరంభ వేడుకలు స్టేడియాల్లో జరిగేవి. అయితే, అందుకు భిన్నంగా బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ దగ్గరలోని ప్రఖ్యాత మాల్‌లో ప్రారంభ వేడుకలను ఘనంంగా నిర్వహించారు. దాదాపు గంటసేపు జరిగిన కార్యక్రమం అభిమానులను అలరించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ప్రారంభ వేడుకలకు క్రికెట్‌ అభిమానులు వేలాదిగా తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి కెప్టెన్లు హాజరుకారని ముందుగా ప్రకటించిన ఐసీసీ ఆభిమానులకు మాత్రం సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే పది జట్ల కెప్టెన్లను వ్యాఖ్యాతలు ఒక్కొక్కరిగా వేదికపైకి ఆహ్వానించారు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌ను అనుసరించి

ఐసీసీ ర్యాంకింగ్స్‌ను అనుసరించి

ఐసీసీ ర్యాంకింగ్స్‌ను అనుసరించి ఆఫ్ఘనిస్థాన్‌తో మొదలుపెట్టి వరుస క్రమంలో చివర్లో విరాట్‌ కోహ్లీ, ఆతిథ్య దేశ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ స్టేజ్‌పైకి వచ్చారు. ఈ సందర్బంగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌తో హోస్ట్‌గా వ్యవహారించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ సరదాగా ముచ్చటించాడు.

కోహ్లీ మాట్లాడుతూ

కోహ్లీ మాట్లాడుతూ

ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంగ్లండ్‌లో మాకు చాలా మంది అభిమానులున్నారు" అని అన్నాడు. ఆ తర్వాత 60 సెకన్ల చాలెంజ్‌లో భాగంగా పది జట్లకు సంబంధించిన మాజీ ఆటగాళ్లు, సెలెబ్రిటీలు బ్యాటింగ్‌తో అలరించారు.

పాక్ ప్రతినిధిగా మలాలా

పాక్ ప్రతినిధిగా మలాలా

పాకిస్థాన్‌ ప్రతినిధిగా నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెస్టిండీస్‌ నుంచి వివ్‌ రిచర్డ్స్‌, స్ర్పింటర్‌ యొహాన్‌ బ్లేక్‌, భారత్‌ నుంచి అనిల్‌ కుంబ్లే, నటుడు ఫర్హాన్‌ అక్తర్‌, పాక్‌ తరఫున అజర్‌ అలీ, మలాలా యూసుఫ్‌, బంగ్లాదేశ్ సినీ తార జయ ఎహసాన్ పాల్గొన్నారు.

భారీ ఎత్తున వినోదాత్మక కార్యక్రమాలు

భారీ ఎత్తున వినోదాత్మక కార్యక్రమాలు

అంతకముందు క్రికెట్, సంగీతం కలబోతగా భారీ ఎత్తున వినోదాత్మక కార్యక్రమాలు అభిమానులను ఎంతగానో అలరించాయి. ఇందులో ఇంగ్లండ్ జోడీ పీటర్సన్, క్రిస్ హ్యుస్ 74 పరుగులతో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రపంచకప్ ట్రోఫీని వేదికపై తీసుకువచ్చాడు. చివరగా వరల్డ్‌కప్‌-2019 సాంగ్‌ ‘స్టాండ్‌ బై'ను వేదికపై ఆలపించడంతో ఆరంభ వేడుకలు ముగిశాయి.

Story first published: Thursday, May 30, 2019, 7:34 [IST]
Other articles published on May 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X