న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-కివీస్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి: న్యూజిలాండ్ 211/5 (46.1)

Chahal

హైదరాబాద్: ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మరో 23 బంతులు మిగిలి ఉన్న సమయంలో వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. స్టేడియం సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పారు.

భువనేశ్వర్‌ కుమార్ 46.1వ బంతి వేసిన తర్వాత ఫీల్డ్‌ అంపైర్లు పిచ్‌ను, ఔట్‌ఫీల్డ్‌ను తనిఖీ చేశారు. ఎక్కువ తేమ ఉండటంతో కవర్లు కప్పాలని స్టేడియం సిబ్బందికి సూచించారు. వర్షంతో మ్యాచ్ నిలిచే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు గాను 211/5 స్థితిలో ఉంది. రాస్‌ టేలర్‌ (6), టామ్‌ లాథమ్‌ (3) క్రీజులో ఉన్నారు.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 వరకూ ఆట కొనసాగకపోతే అంపైర్లు ఓవర్లను కుదిస్తారు. రాత్రి 8.30 తర్వాత కూడా వర్షం కొనసాగితే.. ఓవర్లను కుదించడంతో పాటు భారత్ చేయాల్సిన పరుగులను కూడా సవరిస్తారు. మ్యాచ్ ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. కివీస్ ఇప్పటికే 20 ఓవర్ల ఆట ఆడేసినందున భారత్ కూడా కనీసం 20 ఓవర్లు ఆడాలి. దీంతో టీమిండియాను 20 ఓవర్లైనా ఆడించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.

అయితే, వర్షం వర్షం ఆగకుండా కురిసి ఈ రోజు మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకపోతే ప్రపంచకప్ నిబంధనల ప్రకారం రిజర్వుడే అయిన బుధవారం మ్యాచ్‌ను తిరిగి కొనసాగిస్తారు. రిజర్వు డే అయిన బుధవారం తిరిగి మొదటి నుంచి ఆటను ప్రారంభించరు. ఎక్కడ నుంచి ఆగిందో అక్కడ నుంచి రిజర్వు డే రోజున ఆడిస్తారు. రిజర్వే డే రోజున కూడా మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహించిన విజేతను నిర్ణయిస్తారు.

అయితే, వర్షం కారణంగా బుధవారం కూడా మ్యాచ్ జరిగే అవకాశాలు లేకుండా మ్యాచ్ రద్దు అయితే లీగ్ దశలో న్యూజిలాండ్ కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన కోహ్లీసేనను ఫైనల్‌కు పంపుతారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మంగళవారం మ్యాచ్ జరిగేలా కనిపించడం లేదు.

Jul 09, 2019, 6:34 pm IST

వర్షంతో నిలిచిన మ్యాచ్, కివీస్ 211/5 (46.1)

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. భువనేశ్వర్‌ 46.1వ బంతి వేసిన తర్వాత ఫీల్డ్‌ అంపైర్లు పిచ్‌ను, ఔట్‌ఫీల్డ్‌ను తనిఖీ చేశారు. ఎక్కువ తేమ ఉండటంతో కవర్లు కప్పాలని స్టేడియం సిబ్బందికి సూచించారు. వర్షంతో మ్యాచ్ నిలిచే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు గాను 211/5 స్థితిలో ఉంది. రాస్‌ టేలర్‌ (6), టామ్‌ లాథమ్‌ (3) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఇంకా 23 బంతులే ఉన్నాయి.

Jul 09, 2019, 6:23 pm IST

ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

భారత్‌తో జరుగుతున్నసెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 200 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో గ్రాండ్ హోమ్(16) పరుగుల వద్ద వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 44.4 ఓవర్లకు న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి 200 పరుుగులు చేసింది.

Jul 09, 2019, 6:14 pm IST

రాస్ టేలర్ హాఫ్ సెంచరీ

భారత్‌తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ హాఫ్ సెంచరీ సాధించాడు. చాహల్ వేసిన 44వ ఓవర్‌లో సిక్స్ బాది రాస్ టేలర్ హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. 73 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో రాస్ టేలర్ హాఫ్ సెంచరీ సాధించాడు.

Jul 09, 2019, 6:04 pm IST

నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్నసెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 162 పరుగుల వద్ద పాండ్యా బౌలింగ్‌లో నీషమ్(12) పరుగుల వద్ద దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 41 ఓవర్లకు న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయి 162 పరుుగులు చేసింది.

Jul 09, 2019, 5:57 pm IST

40 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 155/3

భారత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 40 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్(38), జిమ్మీ నీషమ్(7) పరుగులతో ఉన్నారు.

Jul 09, 2019, 5:36 pm IST

చాహల్ బౌలింగ్‌లో విలియమ్సన్ ఔట్

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్నసెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ సరైన సమయంలో చెలరేగడంతో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 134 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్(67) పరుగుల వద్ద జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 36 ఓవర్లకు న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 136 పరుుగులు చేసింది.

Jul 09, 2019, 5:34 pm IST

జడేజా 10 ఓవర్ల కోటా పూర్తి

ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ జడేజా 10 ఓవర్ల కోటా పూర్తైంది. 10 ఓవర్లు వేసిన జడేజా ఒక వికెట్ తీసి 34 పరుగులు ఇచ్చాడు. ఎకామనీ 3.4గా ఉంది.

Jul 09, 2019, 5:23 pm IST

33 ఓవర్లకు న్యూజిలాండ్ 122/2

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 33 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తోండటంతో పరుగులు రాబట్టేందుకు కివీస్ బ్యాట్స్‌మన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్(58), రాస్ టేలర్(22) పరుగులతో ఉన్నారు.

Jul 09, 2019, 5:09 pm IST

విలియమ్సన్ హాఫ్ సెంచరీ

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 79 బంతుల్లో 4 పోర్ల సాయంతో విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ప్రపంచకప్ లో విలియమ్సన్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ. 30 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్(30), రాస్ టేలర్(21) పరుగులతో ఉన్నారు.

Jul 09, 2019, 5:06 pm IST

100కు చేరిన న్యూజిలాండ్ స్కోరు

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 100 పరుగులు మార్కుని అందుకుంది. ప్రస్తుతం 29 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్(48), రాస్ టేలర్(16) పరుగులతో ఉన్నారు.

Jul 09, 2019, 4:55 pm IST

భారత అభిమానుల సందడి

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తక్కువ పరుగులు చేసేలా కనిపిస్తుండటంతో మైదానంలో భారత అభిమానులు హడావుడి చేస్తున్నారు. టుడే స్పెషల్:కివి టిక్కా మసాలా... ఛెప్ ఎవరో తెలుసా విరాట్ కోహ్లీ అంటూ ఓ అభిమాని ప్లకార్డుని ప్రదర్శించాడు.

Jul 09, 2019, 4:47 pm IST

మైదానంలో అడుగుపెట్టిన పాండ్యా

ఆందోళన వద్దు. పాండ్యా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం 24 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(36), రాస్ టేలర్(6) పరుగులతో ఉన్నారు.

Jul 09, 2019, 4:45 pm IST

ఆకట్టుకుంటోన్న కెప్టెన్ కోహ్లీ హావభావాలు

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుండటంతో భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో చాహల్ చెలరేగుతున్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ హావభావాలు ఇలా ఉన్నాయి.

Jul 09, 2019, 4:43 pm IST

పవర్ ప్లేలో న్యూజిలాండ్ చెత్త రికార్డు

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతోంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కివీస్‌ పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ వికెట్‌ కోల్పోయి 27 పరుగులు చేసింది. ఫలితంగా ఈ మెగా టోర్నీలో పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా కివీస్‌ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇప్పటివరకూ ఇంగ్లండ్‌పై భారత్‌ చేసిన 28 పరుగులు పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరుగా ఉండగా, తాజాగా న్యూజిలాండ్‌ దాన్ని సవరిస్తూ చెత్త గణాంకాల అపప్రథను సొంతం చేసుకుంది.

Jul 09, 2019, 4:37 pm IST

మైదానాన్ని వీడిన హార్దిక్ పాండ్యా

ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా బౌలింగ్ వేసేందుకు కొంత ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. అయితే, ఏమైందో తెలియదు గానీ పాండ్యా మైదానాన్ని వీడాడు. ఇది భారత అభిమానులను ఆందోళనకు గురు చేస్తోంది.

Jul 09, 2019, 4:30 pm IST

రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా వేసిన 19వ ఓవర్ రెండో బంతికి న్యూజిలాండ్ ఓపెనర్ హెన్రీ నికోల్స్(28) బౌల్డయ్యాడు. బంతి బ్యాటు, ప్యాడ్ల మధ్యలోంచి వికెట్లను తాకింది. అంతకుముందు నాలుగో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (1) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 18.2 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది.

Jul 09, 2019, 4:04 pm IST

న్యూజిలాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయిందిలా

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టడం ద్వారా న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయిన సంగతి తెలిసిందే. కోహ్లీ క్యాచ్ పట్టిన ఫోటోలు మీకోసం...

Jul 09, 2019, 4:00 pm IST

500 పరుగుల మార్కుని అందుకున్న కేన్ విలియమ్సన్

టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 20 పరుగులు చేయడం ద్వారా ఈ ప్రపంచకప్‌లో 500 పరుగులు మార్కుని అందుకున్నాడు. 2015 వరల్డ్‌కప్‌లో మార్టిన్‌ గప్టిల్‌ 547 పరుగులు సాధించి కివీస్‌ తరఫున తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానాన్ని విలియమ్సన్‌ ఆక్రమించాడు. కాగా, వరల్డ్‌కప్‌లో ఐదు వందల పరుగులు చేసిన తొలి కివీస్‌ కెప్టెన్‌గా విలియమ్సన్‌ ఘనత సాధించాడు. ప్రస్తుతం 12 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి న్యూజిలాండ్ 38 పరుగులు చేసింది. క్రీజులో నికోల్స్(15), విలియమ్సన్ (20) పరుగులతో ఉన్నారు.

Jul 09, 2019, 3:50 pm IST

10 ఓవర్లకు న్యూజిలాండ్ 27/1

ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ 10 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజులో హెన్రీ నికోల్స్(10), కేన్ విలియమ్సన్(14) పరుగులతో ఉన్నారు.

Jul 09, 2019, 3:44 pm IST

9 ఓవర్లకు న్యూజిలాండ్ 23/1

ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ 9 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజులో హెన్రీ నికోల్స్(10), కేన్ విలియమ్సన్(12) పరుగులతో ఉన్నారు.

Jul 09, 2019, 3:39 pm IST

గత ప్రపంచకప్ మార్టిన్ గుప్టిల్ ఇలా!

కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ గత ప్రపంచకప్ తో పోలిస్తే ఈ ప్రపంచకప్ లో పేలవ ప్రదర్శన చేశాడు. గత ప్రపంచకప్ తో 547 పరుగులు చేస్తే... ఈ ప్రపంచకప్ లో 167 పరుగులతో చెత్త ప్రదర్శన చేశాడు.

Jul 09, 2019, 3:34 pm IST

7 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 10/1

ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ 7 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. క్రీజులో హెన్రీ నికోల్స్(3), కేన్ విలియమ్సన్(6) పరుగులతో ఉన్నారు.

Jul 09, 2019, 3:26 pm IST

ఈ ప్రపంచకప్ లో కివీస్ ఓపెనర్లు విఫలం

ఈ ప్రపంచకప్ లో న్యూజిలాండ్ ఓపెనర్లు వరుసగా విఫలమవుతూనే ఉన్నారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మాత్రమే సెంచరీ భాగస్వామ్యం చేసిన ఓపెనర్లు ఆ తర్వాత ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ పూర్తిగా విఫలమయ్యారు. ఈ ప్రపంచకప్ లో తొలి వికెట్‌ భాగస్వామ్యాలివే.

Jul 09, 2019, 3:19 pm IST

తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి మార్టిన్ గుప్టిల్ (1) వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం 4 ఓవర్లకు గాను న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 2 పరుగులు చేసింది.

Jul 09, 2019, 3:11 pm IST

మొదటి రెండు ఓవర్లు మెయిడిన్

జస్ప్రీత్ బుమ్రా వేసిన రెండో ఓవర్ కూడా మెయిడిన్ అయింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. పరుగులు రాబట్టేందుకు కివీస్ బ్యాట్స్ మెన్ ఇబ్బందులు పడుతున్నారు.

Jul 09, 2019, 3:06 pm IST

తొలి ఓవర్‌ మెయిడిన్‌

భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ మెయిడిన్ అయింది. మార్టిన్‌ గప్తిల్‌ ఆరు బంతులు ఆడి పరుగులేమీ చేయలేదు. హెన్రీ నికోల్స్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతంగా బౌలింగ్ వేసాడు.

Jul 09, 2019, 3:02 pm IST

తొలి బంతికే రివ్యూ కోల్పోయిన భారత్

భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి బంతికే టీమిండియా తన రివ్యూని కోల్పోయింది. భువీ వేసిన తొలి బంతిని కివీస్ ఓపెనర్ మార్టిన గుప్టిల్ ఢిపెన్స్ ఆడాడు. దీంతో భారత ఫీల్డర్లు ఎల్బీ కోసం రివ్యూకి వెళ్లారు. అయితే రివ్యూలో నాటౌట్‌గా తేలింది.

Jul 09, 2019, 2:59 pm IST

జట్ల వివరాలు:

భారత్‌: లోకేశ్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌పంత్‌, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా

Jul 09, 2019, 2:53 pm IST

సెమీస్‌లో కోహ్లీసేన గెలవాలంటూ భారత ఫ్యాన్స్ పూజలు

భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే ప్రపంచ కప్ సెమీస్‌లో ఇండియా ఘనవిజయం సాధించాలని మంచిర్యాలలో క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన రాణించి న్యూజిలాండ్‌పై గెలవాలని వారంతా దేవుడిని ప్రార్ధించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు.

Jul 09, 2019, 2:34 pm IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా జరుగుతున్న తొలి సెమీ పైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ తొలుత బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్కే మొగ్గుచూపాడు. న్యూజిలాండ్ ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతోంది. సౌథీ స్థానంలో ఫెర్గూస‌న్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక‌, భార‌త్ కూడా ఒక మార్పుతోనే బ‌రిలోకి దిగుతోంది. కుల్దీప్ స్థానంలో చాహ‌ల్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

Jul 09, 2019, 2:33 pm IST

నో ఫ్లై జోన్‌‌గా మాంచెస్టర్

తొలి సెమీఫైన‌ల్ జ‌ర‌గ‌నున్న‌నేప‌థ్యంలో ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్ర‌క‌టించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఓ లేఖ‌లో ఈ విష‌యాన్ని బీసీసీఐకి చెప్పింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ ఎయిర్‌స్పేస్‌ను ఇవాళ మూసివేస్తున్న‌ట్లు ఈసీబీ ఆ లేఖ‌లో తెలియ‌జేసింది. శ‌నివారం శ్రీలంక‌తో మ్యాచ్ సంద‌ర్భంగా బ్రాడ్‌ఫోర్ట్ జోన్‌లో ఓ ఎయిర్‌క్రాఫ్ట్ బ్యాన‌ర్ల‌తో ప‌దేప‌దే చ‌క్క‌ర్లు కొట్టింది. ఇండియా స్టాప్ మాబ్ లించింగ్‌, జ‌స్టిస్ ఫ‌ర్ క‌శ్మీర్ అన్న బ్యాన‌ర్ల‌తో ఆ విమానం మాంచెస్ట‌ర్ గ‌గ‌న‌త‌లంలో విహ‌రించింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆందోళ‌న‌కు గురైన ఐసీసీ ఇవాళ ఆ స్టేడియంలో ప్రాంతంలో నో ఫ్లై జోన్ ఆదేశాలు జారీ చేసింది.

Jul 09, 2019, 2:27 pm IST

భారీ ఎత్తున స్టేడియానికి చేరుకున్న అభిమానులు

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి సెమీపైనల్ మ్యాచ్ కోసం భారీ ఎత్తున స్టేడియానికి చేరుకున్న భారత అభిమానులు.

Jul 09, 2019, 2:25 pm IST

టాస్ గెలిచేదెవరో?

తొలి సెమీపైనల్‌కుసర్వం సిద్ధం. టాస్ గెలిచేదెవరో?

Jul 09, 2019, 2:20 pm IST

ఓల్డ్ ట్రాఫోర్డ్‌కు చేరుకున్న టీమిండియా.

{headtohead_cricket_3_4}

Story first published: Tuesday, July 9, 2019, 20:48 [IST]
Other articles published on Jul 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X