న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-కివీస్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి: ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ICC World Cup 2019: What Happens If Semis Or Final Is Washed Out? || Oneindia Telugu
ICC World Cup 2019: All you need to know about reserve days, rain rules for semis and final

హైదరాబాద్: ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మరో 23 బంతులు మిగిలి ఉన్న సమయంలో వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. స్టేడియం సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

రెండు గంటల పాటు ఆట నిలిచిపోతే మ్యాచ్ ఓవర్లను కుదిస్తారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 వరకూ ఆట కొనసాగకపోతే అంపైర్లు ఓవర్లను కుదిస్తారు. రాత్రి 8.30 తర్వాత కూడా వర్షం కొనసాగితే.. ఓవర్లను కుదించడంతో పాటు భారత్ చేయాల్సిన పరుగులను కూడా సవరిస్తారు. మ్యాచ్ ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. కివీస్ ఇప్పటికే 20 ఓవర్ల ఆట ఆడేసినందున భారత్ కూడా కనీసం 20 ఓవర్లు ఆడాలి. దీంతో టీమిండియాను 20 ఓవర్లైనా ఆడించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.

వర్షం కారణంగా న్యూజిలాండ్ మరలా బ్యాటింగ్ చేయని పరిస్థితుల్లో (మిగిలిన నాలుగు ఓవర్లు) టీమిండియా టార్గెట్ ఇలా ఉంటుంది.

* 46 overs will be 237

* 40 overs will be 223

* 35 overs will be 209

* 30 overs will be 192

* 25 overs will be 172

* 20 overs will be 148

తిరిగి మొదటి నుంచి ఆటను ప్రారంభించరు

అయితే, వర్షం వర్షం ఆగకుండా కురిసి ఈ రోజు మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకపోతే ప్రపంచకప్ నిబంధనల ప్రకారం రిజర్వుడే అయిన బుధవారం మ్యాచ్‌ను తిరిగి కొనసాగిస్తారు. రిజర్వు డే అయిన బుధవారం తిరిగి మొదటి నుంచి ఆటను ప్రారంభించరు. ఎక్కడ నుంచి ఆగిందో అక్కడ నుంచి రిజర్వు డే రోజున ఆడిస్తారు. రిజర్వే డే రోజున కూడా మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహించిన విజేతను నిర్ణయిస్తారు.

వర్షం కారణంగా బుధవారం కూడా మ్యాచ్ రద్దైతే

అయితే, వర్షం కారణంగా బుధవారం కూడా మ్యాచ్ జరిగే అవకాశాలు లేకుండా మ్యాచ్ రద్దు అయితే లీగ్ దశలో న్యూజిలాండ్ కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన కోహ్లీసేనను ఫైనల్‌కు పంపుతారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మంగళవారం మ్యాచ్ జరిగేలా కనిపించడం లేదు.

ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడితే ఇలా

మరోవైపు జులైన 14న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనున్న ఫైనల్ కూడా ఇలానే వర్షం కారణంగా రద్దయితే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు

భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు.

కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ

భువనేశ్వర్‌ (1/30), జస్ప్రీత్‌ బుమ్రా (1/25) తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌ వేశారు. జట్టు స్కోరు ఒక పరుగు వద్ద ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (1; 14 బంతుల్లో)ను బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత హెన్రీ నికోల్స్‌ (28)తో కలిసి కేన్‌ విలియమ్సన్‌ (67) హాఫ్ సెంచరీతో రాణించడంతో కివీస్ తేరుకుంది. అయితే, జట్టు స్కోరు 69 పరుగుల వద్ద నికోల్స్‌ను జడేజా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో వీరిద్దరి 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

రాస్ టేలర్ హాఫ్ సెంచరీ

రాస్ టేలర్ హాఫ్ సెంచరీ

ఆ తర్వాత వచ్చిన రాస్‌ టేలర్‌ (67నాటౌట్)తో కలిసి కేన్‌ విలియమ్సన్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ క్రమంలో విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. అంతేకాదు ఈ ప్రపంచకప్‌లో 500 పరుగులు మార్కుని అందుకున్నాడు. తద్వారా ఈ వరల్డ్‌కప్‌లో ఐదు వందల పరుగులు చేసిన తొలి కివీస్‌ కెప్టెన్‌గా విలియమ్సన్‌ ఘనత సాధించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించిన తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో చాహల్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఔటయ్యాడు.

జట్టు స్కోరు 134 పరుగుల వద్ద

జట్టు స్కోరు 134 పరుగుల వద్ద

జట్టు స్కోరు 134 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్(67) పరుగుల వద్ద జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జేమ్స్‌ నీషమ్‌ (12) నిరాశపరిచాడు. పాండ్యా బౌలింగ్‌లో నీషమ్(12) పరుగుల వద్ద దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ (16)తో కలిసి టేలర్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చాహల్ వేసిన 44వ ఓవర్‌లో సిక్స్ బాది రాస్ టేలర్ హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. 73 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో రాస్ టేలర్ హాఫ్ సెంచరీ సాధించాడు.

మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన అంఫైర్లు

మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన అంఫైర్లు

ఆ తర్వాత జట్టు స్కోరు 200 పరుగుల వద్ద భువీ బౌలింగ్‌లో గ్రాండ్ హోమ్(16) పరుగుల వద్ద వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత భువనేశ్వర్‌ 46.1వ బంతి వేసిన తర్వాత ఫీల్డ్‌ అంపైర్లు పిచ్‌ను, ఔట్‌ఫీల్డ్‌ను తనిఖీ చేశారు. ఎక్కువ తేమ ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షంతో మ్యాచ్ నిలిచే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు గాను 211/5 స్థితిలో ఉంది. రాస్‌ టేలర్‌ (6), టామ్‌ లాథమ్‌ (3) క్రీజులో ఉన్నారు.

Story first published: Tuesday, July 9, 2019, 20:43 [IST]
Other articles published on Jul 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X