న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Cricket World Cup 2019: మెగా టోర్నీలో 500 పరుగుల మార్కుని చూస్తామా?

ICC World Cup 2019: 4 Teams Likely To Reach The First 500 Run Total In ODI'S | Oneindia Telugu
ICC Cricket World Cup 2019: Will 500-run mark be breached in Cricket World Cup 2019?

హైదరాబాద్: అది 1996 వన్డే వరల్డ్‌కప్. ఈ మెగా టోర్నీలో యువకులతో కూడిన శ్రీలంక జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. దాంతో టోర్నీలో భాగంగా కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టులోని ఆటగాళ్లు విజృంభించారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 398 పరుగులు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో యావప్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కారణం... అప్పట్లో 300పైచిలుకు పరుగులు చేయడం అంటేనే గొప్ప. అలాంటిది శ్రీలంక ఏకంగా 400 పరుగులు చేసింది. అరవింద డిసిల్వా శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను లీడ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 115 బంతుల్లో 145 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

254 పరుగులకే పరిమితమైన కెన్యా

254 పరుగులకే పరిమితమైన కెన్యా

అనంతరం చేధనలో కెన్యా 50 ఓవర్లలో 254 పరుగులకే పరిమితం కావడంతో శ్రీలంక 144 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వన్డే క్రికెట్‌లో క్రికెట్ అభిమానులు 500 పరుగులు గురించి చర్చించుకుంటున్నారు. ఇందుకు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న వన్డే వరల్డ్‌కప్ వేదిక కానుంది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌లో క్రికెట్ అభిమానులు 500 పరుగుల స్కోరుని చూడబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

వన్డేల్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు 481

వన్డేల్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు 481

వన్డేల్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక జట్టు స్కోరు 481. ఈ స్కోరు నమోదైంది ఐదోసారి వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తోన్న ఇంగ్లాండ్‌లోనే. ఇంగ్లాండ్ పిచ్‌లు బ్యాటింగ్‌ స్వర్గధామాలు. ఈ మెగా టోర్నీలో క్రికెట్ ప్రేక్షకులను అలరించేందుకు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా పిచ్‌లను రూపొందించారని సమాచారం. దీంతో ఈ టోర్నీలో పరుగుల వరద పారడం ఖాయం. ఇంగ్లాండ్‌లో ఏ మైదానంలో క్రికెట్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఫ్యాన్స్‌కు అధికారిక స్కోర్‌ కార్డులు అమ్మడం ఆనవాయితీ. ఇప్పటివరకు 400 స్కోర్లకు తగ్గట్లుగా ఆ కార్డులుండేవి.

వరల్డ్‌కప్‌లో '500' స్కోరు కార్డులు

వరల్డ్‌కప్‌లో '500' స్కోరు కార్డులు

అయితే, ఈసారి ఇంగ్లాండ్ స్టేడియాల్లో మ్యాచ్‌లు ముగిసిన తర్వాత అభిమానులకు అమ్మే స్కోరు కార్డుల్ని '500' మార్కుకు తగ్గట్లుగా రీడిజైన్‌ చేయించింది. ఇంగ్లాండ్‌-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 3 వికెట్లకు 373 పరుగులు చేయగా... లక్ష్యచేధనలో పాక్‌ 361 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2015 వన్డే వరల్డ్‌కప్‌ అనంతరం ఐదుసార్లు 400 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఈసారి 500 పరుగుల మార్కుని అందుకునేలా కనిపిస్తోంది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన బ్రిస్టల్‌ స్టేడియంలో 500 పరుగుల అందుకుంటారమో చూడాలి.

విధ్వంసక బ్యాట్స్‌మెన్‌కు కొదవలేదు

విధ్వంసక బ్యాట్స్‌మెన్‌కు కొదవలేదు

ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్‌కప్‌లో విధ్వంసక బ్యాట్స్‌మెన్‌కు కొదవలేదు. ఇంగ్లాండ్‌ జట్టులో జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్‌, బెన్ స్టోక్స్‌ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. భారత జట్టులో రోహిత్, ధావన్, పాండ్యా లాంటి దీటైన బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. ఇక, విండిస్ తరుపున ఈ వరల్డ్ కప్‌లో క్రిస్ గేల్, రస్సెల్ బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్లు గనుక విజృంభిస్తే 500 స్కోరు సాధించడం పెద్ద విషయం కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. కాగా, వన్డేల్లో ఐదు వందల పరుగుల మార్కును ముందుగా అందుకునే సత్తా ఇంగ్లాండ్‌కే ఉందని వరల్డ్‌కప్‌కు ముందు పది జట్ల కెప్టెన్ల మీడియా సమావేశంలో కోహ్లీ అన్న సంగతి తెలిసిందే.

వన్డేల్లో 500 పరుగులు సాధ్యమేనా?

వన్డేల్లో 500 పరుగులు సాధ్యమేనా?

వన్డేల్లో ఆస్ట్రేలియా నమోదు చేసిన అత్యధిక పరుగులు (481/6) రికార్డుని ఇంగ్లాండ్‌ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. దాంతో వన్డేల్లో 500 పరుగులు సాధ్యమేనా అన్న ప్రశ్నకు విరాట్‌ కోహ్లీ బదులిచ్చాడు. "ఇది మీ మీదే (ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ను చూస్తూ) ఆధారపడి ఉంటుంది. 500 పరుగులను అందరికంటే ముందుగానే అందుకోవాలని ఆతృతగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. టోర్నీలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉన్నా.. 370-380 పరుగులను ఛేజ్‌ చేయడం ఎంత కష్టమో 260-270 పరుగుల టార్గెట్‌ను అందుకోవడం కూడా కష్టమే అవుతుంది. మొదట్లో ఎక్కువ స్కోరు నమోదైనా టోర్నీ నడుస్తున్న కొద్ది హైస్కోరింగ్‌ మ్యాచ్‌లు ఉండకపోవచ్చు. 250 పరుులను కాపాడుకోవడం కూడా చూస్తాం" అని కోహ్లీ చెప్పాడు.

Story first published: Wednesday, May 29, 2019, 13:12 [IST]
Other articles published on May 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X