న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిట్‌‌నెస్‌పై కోహ్లీ దృష్టి.. హార్డ్ వర్క్ లేకుండా ఏమీ చేయలేం

ICC Cricket World Cup 2019 : Virat Kohli's Extensive Workout Ahead Of West Indies || Oneindia
ICC Cricket World Cup 2019, West Indies vs India: Indian skipper Virat Kohlis extensive workout ahead of West Indies clash

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పరుగుల ప్రవాహం పారించడానికి కారణం ఫిట్‌నెస్‌. ఇది స్వయంగా కోహ్లీనే తెలిపాడు. తన ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపర్చుకోవాలన్న పట్టుదలతో కోహ్లీ ఉన్నాడు. ప్రపంచకప్‌తో తీరిక లేకుండా ఉన్నా.. దొరికిన సమయాన్ని కూడా ఫిట్‌నెస్‌కే కేటాయిస్తున్నాడు. వెస్టిండీస్‌తో భారత్ గురువారం తలపడనుంది. ఈ మ్యాచ్‌ ముందు కోహ్లీ జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మ్యాచ్‌లో వికెట్ల మధ్య కోహ్లీ చురుగ్గా పరుగెత్తడానికి కారణం కూడా ఫిట్‌‌నెస్‌. సింగల్ వచ్చే దగ్గర రెండు పరుగులు కూడా చేయగలడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ కోసం ఒకవైపు నెట్స్‌లో కష్టపడుతూనే మరోవైపు జిమ్‌లో కూడా కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా జిమ్‌లో చెమటోడుస్తున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. 'విరామం లేదు. హార్డ్ వర్క్ లేకుండా ఏమీ చేయలేం' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

జట్టులో చోటు దక్కించుకోవాలంటే యో-యో ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసవ్వాలనే నిబంధనని బీసీసీఐ విధించిన నేపథ్యంలో భారత ఆటగాళ్లు అందరూ ఫిట్‌‌నెస్‌పై దృష్టి పెట్టారు. అందరికంటే ముఖ్యంగా కోహ్లీ. తన ఫిట్‌‌నెస్‌తో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఐపీఎల్ 2012 తర్వాత ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవాలన్న నిర్ణయం తన కెరీర్‌ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడింది. మంచి ఫిట్‌నెస్‌ సాధించడం వల్లే బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుగయ్యా. 2012 ఐపీఎల్‌ వరకూ ఫిట్‌నెస్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే దాకా ఏం తినాలి, దానికి తగ్గట్టు ఎంత వర్కవుట్‌ చేయా లనే అంశాలను పట్టించుకోలేదు. ఆ తర్వాతే బాడీపై దృష్టి పెట్టిన‌ట్లు గతంలో కోహ్లీ చెప్పాడు.

భారత్‌కు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈనెల 27న వెస్టిండీస్‌ (మాంచెస్టర్‌), 30న ఇంగ్లాండ్‌ (బర్మింగ్‌హామ్‌), జులైన 2న బంగ్లాదేశ్‌ (బర్మింగ్‌హామ్‌), 6న శ్రీలంక (లీడ్స్‌)లతో తలపడనుంది. వీటిలో రెండు మ్యాచ్‌లు గెలిస్తే చాలు భారత్‌ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. వెస్టిండీస్‌, శ్రీలంకలపై విజయం సులువే. ఇక ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌లు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

Story first published: Wednesday, June 26, 2019, 14:16 [IST]
Other articles published on Jun 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X