న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐకి ఐసీసీ రిక్వెస్ట్.. ధోనీ గ్లౌజులపై ఆ గుర్తు తొలగించండి

ICC Cricket World Cup 2019 : ICC Requests BCCI To Remove Indian Army Insignia From MS Dhoni’s Gloves
ICC Cricket World Cup 2019: South Africa vs India: ICC request BCCI, Remove Indian Army Insignia From MS Dhonis Gloves


టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ గ్లౌజులపై బలిదాన్‌ గుర్తు తొలగించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కోరింది. ధోనీకి భారత ఆర్మీ అంటే ఎంతో గౌరవం. తనకు ఆర్మీలో చేరాలనే కోరిక ఉందని చాలాసార్లు చెప్పాడు. మ్యాచ్ సందర్భంగా ఈ అభిమానాన్ని ధోనీ ఎన్నోసార్లు చూపించాడు కూడా. ఇక ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ధోనీ తన కీపింగ్‌ గ్లౌజ్‌పై 'బలిదాన్‌ బ్యాడ్జ్‌' (ఆర్మీకి చెందిన లోగో) వేయించుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ధోనీ దేశభక్తి:

ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికాతో తోలి మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో ప్రొటీస్ ఆటగాడు ఫెలుక్‌వాయోను స్టంపౌట్‌ చేయడం ద్వారా గ్లౌజ్‌పై ఉన్న లోగో అభిమానుల కంట పడింది. భారత సైన్యానికి చెందిన బలిదాన్‌ గుర్తు ఉన్న గ్లౌజులు ధోనీ ధరించడంతో సామాజిక మాధ్యమాల్లో అతడిపై ప్రశంసల జల్లు కురిసింది. ధోనీ దేశభక్తిని అభిమానులు మెచ్చుకున్నారు.

లోగో తీయించండి:

లోగో తీయించండి:

మరోవైపు ధోనీ లోగోపై ఐసీసీ మాత్రం అభ్యన్తరం వ్యక్తం చేసింది. ధోనీ గ్లౌజులపై బలిదాన్‌ గుర్తు క్రికెట్ నిబంధనలకు విరుద్ధం. ఆ గుర్తు తొలగించాలని ఐసీసీ స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ జీఎం క్లైర్‌ ఫోర్లాంగ్‌ బీసీసీఐని కోరారు. 'ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్‌ సామాగ్రిపై.. జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరాం' అని ఫర్లాంగ్‌ వెల్లడించారు.

చర్యలు తీసుకోలేదు:

చర్యలు తీసుకోలేదు:

కాగా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ధోనీకి శిక్ష విధిస్తారా అని ఫర్లాంగ్‌ను అడగ్గా.. 'మొదటి ఉల్లంఘన కాబట్టి కేవలం గుర్తు తొలగించాలని కోరాం. చర్యలు తీసుకోలేదు' అని ఫోర్లాంగ్‌ తెలిపారు. ఐసీసీ నిబంధనలతో ఇకపై.. వచ్చే మ్యాచ్‌లలో ధోనీ బలిదాన్‌ గుర్తు గ్లౌజ్‌లు వాడడు. టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడునుంది.

 ధోనీకి లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా:

ధోనీకి లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా:

ఇంతకుముందు కూడా ధోనీ ఆర్మీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లకి ఆర్మీ క్యాపులు అందించాడు. ఆ మ్యాచ్‌లో ఆటగాళ్లు ఆ క్యాపులు ధరించే ఆడారు. 2011లో ధోనీకి లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా దక్కింది. ఆ సమయంలో అతను ఆగ్రాలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఈ ట్రైనింగ్‌లో భాగంగా ధోనీ ఐదు సార్లు పారాచూట్‌ డైవింగ్‌ కూడా చేశాడట.

Story first published: Friday, June 7, 2019, 9:47 [IST]
Other articles published on Jun 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X