న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'చివరి ఓవర్‌.. అఫ్గాన్‌ను కట్టడి చేసేందుకు 16 పరుగులు చాలనుకున్నా'

ICC Cricket World Cup 2019, India vs Afghanistan: Jasprit Bumrah left enough runs for me to execute my plans says Pacer Mohammed Shami

చివరి ఓవర్‌లో అఫ్గాన్‌ను కట్టడి చేసేందుకు 16 పరుగులు చాలనుకున్నానని టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్‌ షమీ తెలిపారు. ప్రపంచకప్‌లో భాగంగా సౌతాంప్టన్‌ వేదికగా శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో హ్యాట్రిక్‌ తీసి టీమిండియాకు చిరస్మరనీయ విజయాన్ని అందించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అతనో అద్భుత బౌలర్:

మ్యాచ్‌ అనంతరం బీసీసీఐ టీవీతో మహ్మద్‌ షమీ మాట్లాడారు. ' హ్యాట్రిక్‌ తీయడం చాలా ఆనందంగా ఉంది. చివరి రెండు ఓవర్లలో అఫ్గాన్‌కు విజయానికి 21 పరుగులు అవసరమైన స్థితిలో బుమ్రాపై నమ్మకముంచా. అతనో అద్భుత బౌలర్. 49వ ఓవర్‌లో బుమ్రా కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. దీంతో నాపని మరింత సులువు అయింది' అని షమీ పేర్కొన్నారు.

16 పరుగులు చాలనుకున్నా:

16 పరుగులు చాలనుకున్నా:

'చివరి ఓవర్‌లో అఫ్గాన్‌ను కట్టడి చేసేందుకు 16 పరుగులు చాలనుకున్నా. అనంతరం నా ప్రణాళిక అమలు చేశా. బుమ్రాతో కలిసి బౌలింగ్‌ చేయడం బాగుంది. ఇనింగ్స్ మొదటలో మంచి బౌలింగ్‌ చేసినా.. మధ్యలో ఓవర్లలో పరుగులు ఇచ్చాం. అయినా చివరి పది ఓవర్లలో మళ్లీ మ్యాచ్‌పై పట్టుసాధిస్తామనే నమ్మకం ఉంది. అదే జరిగింది' అని షమీ చెప్పారు.

బుమ్రా అసహనం:

బుమ్రా అసహనం:

చివరి ఓవర్‌లో అఫ్గాన్‌ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరం. కెప్టెన్ కోహ్లీ బంతిని మహ్మద్‌ షమీకి ఇచ్చాడు. అఫ్గానిస్తాన్‌ జట్టు కోసం ఒంటరి పోరాటం చేస్తున్న మహ్మద్‌ నబీ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. షమీ తొలి బంతిని యార్కర్‌ వేయబోయి ఫుల్‌టాస్‌ వేశాడు. ఆ బంతిని నబీ ఫోర్‌ బాదాడు. దీంతో ఒక్కసారిగా భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. బుమ్రా అయితే తీవ్ర అసహనానికి గురయ్యాడు. మరుసటి బంతిని నబీ డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా షాట్‌ ఆడాడు. సింగిల్‌ వచ్చే అవకాశం ఉన్నా తీయలేదు.

షమీ హ్యాట్రిక్‌:

షమీ హ్యాట్రిక్‌:

ఇక నాలుగు బంతుల్లో 12 పరుగులుగా సమీకరణం మారింది. దీంతో బౌలర్‌ షమీపై ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలోనే ధోనీ తన వ్యూహాన్ని అమలు చేశాడు. ధోనీ.. షమీ దగ్గరకు పరుగెత్తుకొచ్చి కొన్ని సూచనలు ఇచ్చాడు. అంనతరం ఫీల్డింగ్‌ మార్చుకున్న షమీ.. యార్కర్‌ సంధించాడు. దీన్ని నబీ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడగా.. బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ప్యాండ్యా చేతిలో పడింది. భారత శిబిరంలో ఆనందం వెల్లువిరిసింది. మరుసటి రెండు బంతులను యార్కర్లతో అప్తాబ్‌ అలామ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లను క్లీన్‌బౌల్డ్‌ చేసాడు. దీంతో అతడు ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ తీయడంతో పాటు టీమిండియాకి విజయాన్ని అందించాడు.

Story first published: Sunday, June 23, 2019, 16:16 [IST]
Other articles published on Jun 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X