న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2013లో ఆర్చర్‌ ట్వీట్‌.. ఇంగ్లండ్ గెలుస్తుందని ముందే తెలుసా!!

ICC Cricket World Cup 2019: How New Zealand lost this game, World Cup 2019 final in Jofra Archers tweets

ఆదివారం లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ఐసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడినా చివరకు ఇంగ్లాండ్‌నే వరించింది. ఈ ప్రపంచకప్‌లో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ అద్భుత ప్రదర్శన చేసాడు. ఒకే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక వికెట్లు (20) తీసిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కి సంచలనం సృష్టించాడు. అయితే ప్రస్తుతం ఆర్చర్‌ తన ప్రదర్శనతో కాకుండా.. 2013లో చేసిన ఒక ట్వీట్‌తో వార్తల్లో నిలిచాడు.

2013లో ట్వీట్‌:

ఆర్చర్‌ 2013లో ఒక ట్వీట్‌ చేస్తూ.. '16 పరుగులు, 6 బంతులు' అని రాసుకొచ్చాడు. ప్రపంచకప్‌-2019లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ సూపర్‌ ఓవర్‌లో 15 పరుగులు చేసింది. అంటే.. న్యూజిలాండ్‌ లక్ష్యం 6 బంతుల్లో 16 పరుగులు. ఈ ఫలితాన్ని ఆర్చర్‌ ముందే ఊహించే ట్వీట్‌ చేశాడా? అని అందరూ అనుకుంటున్నారు.

సూపర్‌ ఓవర్‌ను పట్టించుకోవడం లేదు:

ఆ ట్వీట్ అనంతరం ఏడాది వ్యవధిలో ఆర్చర్‌ మరో ట్వీట్‌ చేశాడు. 'లార్డ్స్‌కు వెళ్లాలనుకుంటున్నా' అని పోస్ట్‌ చేశాడు. ఇక 2015లో మరొక ట్వీట్‌ చేస్తూ 'సూపర్‌ ఓవర్‌ను పట్టించుకోవడం లేదు' అని రాసుకొచ్చాడు. ఆర్చర్‌ చేసిన అప్పటి ట్వీట్లు ప్రస్తుత ప్రపంచకప్‌లో జరిగిపోయాయి. దీంతో ఈ ట్వీట్లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

 సూపర్‌ పవర్‌ ఉందా:

సూపర్‌ పవర్‌ ఉందా:

ఆర్చర్‌కు 'సూపర్‌ పవర్‌ ఉందా' అని ఓ నెటిజన్ ట్వీట్ చేసాడు. 'ఆర్చర్‌ భవిష్యత్తుకు అతనే జ్యోతిష్కుడు' అని మరొకరు ట్వీట్‌ చేశారు. 'కాలజ్ఞాని, నిజమైన దేవుడు', 'కలలు నిజం అంటే ఇదే. అందుకు ఆధారాలు ఇవే' అని నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఆర్చర్‌ చేసిన ట్వీట్లు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అయ్యాయి.

టాపర్ ఆర్చర్‌:

టాపర్ ఆర్చర్‌:

ఒకే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక వికెట్లు (20) తీసిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మ్యాట్‌ హెన్రీని ఔట్‌ చేసి ఈ ఘనత సాధించాడు. 18 వికెట్లతో మార్క్‌ వుడ్‌ రెండో స్థానంలో ఉండగా.. క్రిస్ వోక్స్‌ 16 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ముగ్గురూ ప్రస్తుత ప్రపంచకప్‌లోనే అత్యధిక వికెట్లు సాధించారు. 1992 ప్రపంచకప్‌లో 16 వికెట్లు తీసిన ఇయాన్ బోథమ్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. 2007 ప్రపంచకప్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ 14 వికెట్లు తీసి ఐదో స్థానంలో ఉన్నాడు.

Story first published: Monday, July 15, 2019, 17:42 [IST]
Other articles published on Jul 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X