న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ తొలి మ్యాచ్: టాస్ నెగ్గిన సఫారీలు, ఇంగ్లాండ్ బ్యాటింగ్

 ICC Cricket world Cup 2019: England vs South Africa: Proteas win toss, elect to bowl first

హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ వన్డే వరల్డ్‌కప్‌కు బుధవారం తెరలేచింది. టోర్నీలో భాగంగా ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది.

తొలి మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ రికార్డుకి దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఆమ్లా మరో 90 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

విరాట్ కోహ్లీ వన్డేల్లో 8వేల పరుగుల మైలరాయిని 175 ఇన్నింగ్స్‌లో అందుకోగా ఆమ్లా 171 ఇన్నింగ్స్‌లో 7910 పరుగులు సాధించాడు. అలా కాకుండా ఈ మ్యాచ్‌లో 37 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌పై వన్డేల్లో వెయ్యి పరుగులు చేసిన రెండో సఫారీ క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు.

1
43644

ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

జట్ల వివరాలు:
దక్షిణాఫ్రికా

హషీమ్‌ ఆమ్లా, క్వింటన్‌ డికాక్‌, అయిడెన్‌ మార్క్రం, ఫా డు ప్లెసిస్‌(కెప్టెన్‌), రస్సీ వాన్‌ దర్‌ డుస్సెన్‌, జేపి డుమిని, అండిలే ఫెలుక్వాయో, డ్వైన్‌ ప్రిటోరియస్‌, రబాడా, లుండి ఎన్గిడి, ఇమ్రాన్‌ తాహిర్‌

ఇంగ్లాండ్
ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జోరూట్‌, జేసన్ రాయ్, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, లియామ్‌ ప్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, అదిల్‌ రషీద్‌

{headtohead_cricket_2_6}

Story first published: Thursday, May 30, 2019, 16:37 [IST]
Other articles published on May 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X