న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రిషబ్ పంత్ నాకు పోటీ కాదు'

Saha Says,Don't Consider Pant as My Competitor | Oneindia telugu
I dont look at Rishabh Pant as my competition, we hardly speak about selection, says Wriddhiman Saha

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తనకు పోటీదారు కాదని సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పేర్కొన్నాడు. గతేడాది ఐపీఎల్‌లో గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన వృద్ధిమాన్ సాహా ఇంగ్లాండ్ వెళ్లి మోచేతికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా బెంగాల్ జట్టు తరుపున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా సాహా క్రికెట్ నెక్ట్స్.కామ్ వెబ్‌సైట్‌కి ఇంటర్యూ ఇచ్చాడు.

భారత్-పాక్ మ్యాచ్: దుబాయిలో బీసీసీఐతో మాట్లాడనున్న పాక్ బోర్డుభారత్-పాక్ మ్యాచ్: దుబాయిలో బీసీసీఐతో మాట్లాడనున్న పాక్ బోర్డు

గాయం తర్వాత జట్టులోకి

గాయం తర్వాత జట్టులోకి

"గాయం తర్వాత ఆటగాళ్లతో కలవడం గొప్పగా అనిపిస్తోంది. ఒక ఆటగాడిగా తిరిగి జట్టులోకి అడుగుపెట్టడం కన్నా ఆనందం ఏముంటుంది. చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్నట్టు నేను భావించలేదు. రెండు మూడు వారాలు విశ్రాంతి తీసుకున్నా అంతే. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో బెంగాల్‌కు సాయం చేయడంపైనే దృష్టి పెడుతున్నా" అని సాహా అన్నాడు.

నేను దూరం కావడంతో పంత్‌కు అవకాశం

నేను దూరం కావడంతో పంత్‌కు అవకాశం

"నేను జట్టుకు దూరమైనప్పుడు రిషబ్ పంత్ అవకాశం అందుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని ఎవరైనా అందిపుచ్చుకోవాలనే ప్రయత్నిస్తారు. రిషబ్ పంత్ కూడా అలాగే చేశాడు. అతడిని నాకు పోటీదారుగా భావించను. నిజానికి పంత్‌ ఎన్‌సీఏకు వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి చాలా సమయం గడిపాం" అని సాహా తెలిపాడు.

జట్టుకు సేవలందించడమే నా లక్ష్యం

జట్టుకు సేవలందించడమే నా లక్ష్యం

"సెలక్షన్‌, ప్రదర్శన గురించి మాట్లాడుకుంది మాత్రం చాలా తక్కువే. నా స్థాయికి తగ్గ ప్రదర్శనతో జట్టుకు సేవలందించడమే నా లక్ష్యం. జాతీయ జట్టులో ఎంపికపై గురించి ఆలోచించడం లేదు. ముందు నేను బాగా ఆడితే జట్టులో చోటు దక్కుతుంది" అని సాహా అన్నాడు. కాగా, ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్ ఆడనుంది.

విశాఖ వేదికగా తొలి టీ20

విశాఖ వేదికగా తొలి టీ20

ఫిబ్రవరి 24న విశాఖపట్నం వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరిస్ ప్రారంభం కానుంది. వరల్డ్‌కప్‌కి ముందు టీమిండియా ఆడనున్న చివరి వన్డే సిరిస్ ఇదే కావడం విశేషం. దీంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్‌లో వరల్డ్ కప్‌కు ఎంపిక చేయబోయే జట్టుపై సెలక్టర్లు దృష్టి సారంచనున్నారు.

Story first published: Wednesday, February 20, 2019, 14:48 [IST]
Other articles published on Feb 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X