న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లీషు గడ్డపై విఫలమైనందుకు సిగ్గు పడటం లేదు: ధావన్

I did not do well in England despite giving my all, there is no shame in it: Dhawan

హైదరాబాద్: ఇంగ్లీషు గడ్డపై తాను వందశాతం రాణించడానికే ప్రయత్నించానని, అయితే విఫలమయ్యానని తన వైఫల్యాన్ని ఒప్పుకుంటున్నందుకు సిగ్గు పడట్లేదని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం దుబాయి వేదికగా ఫైనల్ జరగనుంది.

వెస్టిండిస్‌తో సిరిస్: ధావన్‌కు విశ్రాంతి, మయాంక అగర్వాల్ అరంగేట్రం?వెస్టిండిస్‌తో సిరిస్: ధావన్‌కు విశ్రాంతి, మయాంక అగర్వాల్ అరంగేట్రం?

ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ మాట్లాడుతూ "ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ విషయానికొస్తే పూర్తి స్థాయిలో ఆడేందుకే ప్రయత్నించా. మిగిలినవాళ్లు నాకన్నా బాగా ఆడారు. ఈ విషయాన్ని అంగీకరించడానికి నేనేమీ సిగ్గు పడట్లేదు. ఆసియాకప్‌లో ఆట ఇంగ్లాండ్‌కు భిన్నం. ఎర్ర బంతి స్థానంలో తెల్ల బంతి వచ్చింది" అని అన్నాడు.

పాకిస్థాన్‌ జట్టు కాగితంపై బలమైనదే

పాకిస్థాన్‌ జట్టు కాగితంపై బలమైనదే

"ఇక్కడ పరిస్థితులు వేరు. ఒక్కోసారి మన ప్రణాళికలు ఫలిస్తాయి. ఒక్కోసారి అనుకున్నవి అనుకున్నట్లు జరగవు. పాకిస్థాన్‌ జట్టు కాగితంపై బలమైనదే. కానీ బంగ్లాదేశ్‌ ఆ జట్టుకన్నా బాగా ఆడింది. పెద్ద జట్లపై బంగ్లాదేశ్ భయం లేకుండా ఆడుతోంది. ఆ జట్టు పెద్ద టోర్నీల్లో గెలవాలంటే ఇంకా సమయం పడుతుంది" అని ధావన్ పేర్కొన్నాడు.

 కోహ్లీ లేకపోవడం వల్ల మాపై ఒత్తిడి కన్నా బాధ్యత

కోహ్లీ లేకపోవడం వల్ల మాపై ఒత్తిడి కన్నా బాధ్యత

"ఆసియా కప్‌లో ఫైనల్‌ చేరడం కూడా ఆ జట్టుకు పెద్ద ఘనతే. రెగ్యులర్ విరాట్‌ కోహ్లీ లేకపోవడం వల్ల మాపై ఒత్తిడి కన్నా బాధ్యత ఎక్కువ పెరిగింది. యువ ఆటగాళ్లు సత్తా నిరూపించుకునేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ ఆసియాకప్‌ అవకాశాన్ని కల్పించింది" అని శిఖర్‌ ధావన్ చెప్పుకొచ్చాడు.

వెస్టిండిస్‌తో నెలరోజుల పాటు సిరిస్

వెస్టిండిస్‌తో నెలరోజుల పాటు సిరిస్

ఇదిలా ఉంటే, ఆసియా కప్ ముగిసిన తర్వాత వెస్టిండిస్‌తో టీమిండియా నెలరోజుల సిరిస్ ఆడనుంది. ఇందులో భాగంగా వెస్టిండిస్ జట్టు ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. ఈ సిరిస్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌కి చోటు దక్కడం అనుమానంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో ధావన్‌ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ కోసం అతని స్థానంలో యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ని తీసుకోవాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ధావన్ స్థానంలో మయాంక అగర్వాల్

ధావన్ స్థానంలో మయాంక అగర్వాల్

కర్ణాటకకు చెందిన ఈ యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ గత ఏడాది కాలంగా దేళవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. 2017-18 విజయ్ హజారే ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్‌లాడిన మయాంక్ అద్బుతమైన రీతలో 723 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టులో ఆడేందుకు గాను సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Friday, September 28, 2018, 8:27 [IST]
Other articles published on Sep 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X