నా భార్య కంటే ధోనీ అంటేనే ఎక్కువ ఇష్టం: పాకిస్థాన్ అభిమాని

Posted By:
Dhoni Gets Fans Over Pakistan
Here is why this famous Pakistani fan loves MS Dhoni more than his wife

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ చూసిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడు. అంతేకాదు భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. అలాంటి మహేంద్ర సింగ్ ధోని అంటే అభిమానం ఉండని అభిమానులు ఎవరు ఉంటారు చెప్పండి. అయితే, పాక్‌కు చెందిన మహమ్మద్‌ బషీర్‌ 'నా భార్య కంటే నాకు టీమిండియా క్రికెటర్‌ మహేంద్ర సింగ్ ధోనీ అంటేనే ఎక్కువ ఇష్టం' అని అంటున్నాడు.

చికాగోలో నివసిస్తోన్న చాచా

చికాగోలో నివసిస్తోన్న చాచా

పాకిస్తాన్‌కు చెందిన చాచా చికాగోలో నివసిస్తున్నారు. ప్రస్తుతం నిదాహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకలో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో మహ్మద్‌ బషీర్‌ అకా (చికాగో చాచా), భారత అభిమాని సుధీర్‌, బంగ్లా అభిమాని షోయబ్‌ అలీలతో కలిసి మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంలో తనకు ధోనీ అంటే ఎందుకు అంత ఇష్టమో వెల్లడించాడు.

 భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు లేవని చెప్పారు

భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు లేవని చెప్పారు

‘2011 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మొహాలీ వేదికగా సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ కోసం నేను పాకిస్థాన్ నుంచి రెండు రోజులు ముందుగానే అక్కడి వచ్చా. టిక్కెట్‌ కోసమని మైదానం వద్దకు వెళ్లగా టికెట్లు లేవని చెప్పారు. దీంతో నేను తీవ్ర నిరాశ చెందాను. తిరిగి వెళ్లిపోదామని అనుకున్న నాలో మ్యాచ్‌ ఎలాగైనా చూడాలన్న బలమైన కోరిక అలాగే ఉండటంతో మరొక్కసారి ప్రయత్నించడంలో తప్పు లేదనుకున్నాను' అని అన్నాడు.

 అప్పటివరకు ధోని అంటే ఎవరో తెలియదు

అప్పటివరకు ధోని అంటే ఎవరో తెలియదు

'అందుకే తర్వాతి రోజు మరోసారి స్టేడియానికి వచ్చాను. నాకు మ్యాచ్‌ చూడాలని ఉందని ప్లకార్డు ప్రదర్శించాను. ఓ వ్యక్తి టికెట్స్‌ ఉన్న కవర్‌ తీసుకొచ్చి ఇస్తూ.. ఈ టికెట్లు ధోని పంపించాడని తెలిపాడు. నిజంగా అప్పటికి ధోని ఎవరో కూడా నాకు తెలియదు. ఆ టికెట్స్‌తో మ్యాచ్‌ను ఆస్వాదించాను. కానీ, అప్పటి నుంచి మాత్రం నాకు ధోనీ అంటే చాలా ఇష్టం. ఎంతంటే.. నా భార్య కంటే కూడా నాకు ఎక్కువగా ధోనీనే ఇష్ట పడుతున్నాను' అని తెలిపారు.

 భారత్‌ శత్రుదేశం అని యువకులకు నూరిపోశారు

భారత్‌ శత్రుదేశం అని యువకులకు నూరిపోశారు

ఆ క్షణం నుంచి భారత్‌ మ్యాచ్‌లు చూస్తూనే ఉన్నానని నవ్వుతూ చెప్పాడు. ‘అయితే చాలా మంది భారత్‌కు ఎందుకు మద్దతిస్తున్నావని అడిగుతుంటారు. వారందరికీ నేను ఒకటే సమాధానమిస్తా. అదేంటంటే.. ఇండియాలో మనకు కావాల్సినంత ప్రేమ దొరుకుతుంది. కానీ, మా దేశంలో వృద్ధులంతా భారత్‌ శత్రుదేశం అని యువకులకు నూరిపోశారు. కానీ, అందులో నిజం లేదు' అని చాచా పేర్కొన్నాడు.

Story first published: Saturday, March 10, 2018, 10:57 [IST]
Other articles published on Mar 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి