న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాల్ ట్యాంపరింగ్‌: 'పెద్ద స్థాయిలోని వ్యక్తులను కూడా తప్పించాలి'

‘Heads must roll on and off the field’: Warne calls for an overhaul of Australian cricket

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టులోనే బ్యాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి జట్టు నుంచి వైదొలిగారు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్‌లు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లలోనూ ఆస్ట్రేలియా రాణించకపోగా పర్యటన మొత్తం డిజాస్టర్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులోని మరి కొంతమంది ఆటగాళ్లపై వేటు పడాలని, దేశ క్రికెట్‌ అధినాయకత్వం ఇందుకు బాధ్యత వహించాలని మాజీ క్రికెటర్‌, స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ అభిప్రాయపడ్డారు.

58 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి:

58 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి:

దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆసీస్‌ జట్టు 3-1 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన నాలుగో టెస్టులో 492 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ చిత్తయింది. 1960 దశకం తర్వాత ఆసీస్‌పై సఫారీ జట్టు టెస్టు సిరీస్‌ విజయం సాధించడం ఇదే తొలిసారి.

ప్రపంచ శక్తిగా ఎదగాలంటే:

ప్రపంచ శక్తిగా ఎదగాలంటే:

ఈ సిరీస్‌కు ముందు భారత్‌తో తలపడిన మూడు టెస్టులలోనూ రెండింటిని కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆటతీరుపై స్పందించాడు షేన్ వార్న్. ‘ఆస్ట్రేలియా జట్టు మరోసారి ప్రపంచ శక్తిగా ఎదగాలంటే సరైన వ్యక్తులు రంగంలోకి దిగాల్సిన అవసరముంది. ఇప్పుడు కొత్తవారికి ఆటతోపాటు క్రికెట్‌ నాయకత్వంలోనూ అవకాశాలు ఉన్నాయి. (బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో) అన్ని హోదాల్లో ఉన్నవారు ప్రమాదంలో పడ్డారు. పెద్ద తలకాయలు దిగిపోవాల్సింది' అని విశ్లేషించాడు.

కోచ్‌తోపాటు బ్యాటింగ్‌ కోచ్‌లు కూడా:

కోచ్‌తోపాటు బ్యాటింగ్‌ కోచ్‌లు కూడా:

దక్షిణాఫ్రికా సిరీస్‌ ఓటమి నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ జేమ్స్‌ సదర్‌లాండ్‌, టీమ్‌ మేనేజర్‌ ప్యాట్‌ హోవార్డ్‌ తమ పదవుల నుంచి దిగిపోవాల్సిందేనన్నాడట. ఈ విషయాన్ని పరోక్షంగా వార్న్‌ పేర్కొన్నట్టు ఫాక్స్‌ స్పోర్ట్స్ అనే ప్రముఖ క్రీడా మాధ్యమం తెలిపింది. కోచ్‌తోపాటు బ్యాటింగ్‌ కోచ్‌లు కూడా బాధ్యత వహించాలని, ఇంకెప్పుడు ఒక మంచి బ్యాట్స్‌మన్‌ను జట్టుకు అందిస్తారని ప్రశ్నించారు.

వ్యక్తిగత విచారణ జరగాలని:

వ్యక్తిగత విచారణ జరగాలని:

ఇదిలా ఉంచితే, బాల్ ట్యాంపరింగ్ విషయంలో జట్టుకు సంబంధించిన అధికారుల నుంచి ఆటగాళ్ల వరకు వ్యక్తిగత విచారణ అనేది జరగాలని ఆస్ట్రేలియన్ క్రికెటర్ అసోసియేషన్ పేర్కొంది. అసోసియేషన్ అధికారి గ్రెగ్ డెయ్యర్ మాట్లాడుతూ.. నాయకత్వం నుంచే అన్నీ అలవడతాయి. అధికారుల ఆమోదం లేకుండా తప్పులు జరిగాయని అనుకోను. కాబట్టి కేప్‌టౌన్‌లో జరిగిన టెస్ట్‌పై వ్యక్తిగత విచారణ చేయాలని పిలుపునిచ్చారు.

Story first published: Wednesday, April 4, 2018, 12:43 [IST]
Other articles published on Apr 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X