న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాండ్యా కొడుకు పేరు ఏంటో తెలుసా?.. బహుమతిగా మెర్సిడెజ్ కారు!!

Hardik Pandya revealed the name of his newborn baby boy

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఇటీవల తండ్రైన విషయం తెలిసిందే. జూలై 30న హార్దిక్‌ భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ పండంటి బాబుకు జన్మనిచ్చారు. బుల్లి హార్దిక్ పాండ్యా ఫొటోల్ని సోషల్ మీడియా వేదికగా తొలిరోజే అభిమానులతో హార్దిక్‌ పంచుకున్నాడు. ఆపై గులాబీ బోకేను బెడ్‌పై ఉంచి భార్య నటాషాను ఆలింగనం చేసుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే బాబు పేరుని మాత్రం అతడు ఇంతకాలం సీక్రెట్‌గా ఉంచి తాజాగా రివీల్ చేశాడు.

మరో ఎంఎస్ ధోనీ ఎప్పటికీ రాలేడు: మిథాలీమరో ఎంఎస్ ధోనీ ఎప్పటికీ రాలేడు: మిథాలీ

బుల్లి పాండ్యాకు పేరు:

బుల్లి పాండ్యాకు పేరు:

తాజాగా హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్‌కోవిచ్‌లు తమ కొడుకు పేరును ప్రకటించారు. బుల్లి హార్దిక్ పాండ్యాకు 'అగస్త్య' అని పేరుపెట్టారు. ఈ విషయాన్ని హార్దిక్ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా వెల్లడించాడు. ఓ కార్ డీలర్ షిప్ కంపెనీ బుల్లి పాండ్యా కోసం మెర్సిడెజ్ కారు బొమ్మను బహుమతిగా పంపింది. అయితే ఆ బొమ్మ కారు హార్దిక్‌కు బాగా నచ్చిందేమో.. దానిపై కూర్చుని ఫొటో దిగాడు. ఆ ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. దానికి అగస్త్యాకి ఫస్ట్ Mercedes-AMGగా రాసుకొచ్చాడు. అంతేకాదు కారును బహుమతిగా పంపిన కార్ డీలర్ షిప్ కంపెనీకి కూడా తన ఇన్‌స్టాగ్రాం పోస్టు ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.

ఆగస్టు 20 తర్వాత:

ఆగస్టు 20 తర్వాత:

చాలా రోజుల నుంచి క్రికెట్ దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2020 ద్వారా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది. ఆగస్టు 20 తర్వాత ఆటగాళ్లు యూఏఈకి వెళ్లనున్నారు. ముంబై ఇండియన్స్ టీమ్‌లో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా.. ఈ సీజన్‌లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో ముంబై టైటిల్ గెలవడంలో హార్దిక్ క్రియాశీలక పాత్ర పోషించాడు.

2016లో అరంగేట్రం:

2016లో అరంగేట్రం:

గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో 532, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 957, పొట్టి క్రికెట్‌లో 310 పరుగులు చేశాడు. గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత ఫిట్‌నెస్ సాధించి రీఎంట్రీకి సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. కరోనా వైరస్‌ కారణంగా ఆ సిరీస్ రద్దు అయింది. లాక్‌డౌన్‌ కలిసి రావడంతో మరింత ఫిట్‌నెస్‌ సాధించాడు.

డైలమాలో హార్దిక్:

డైలమాలో హార్దిక్:

వెన్నుగాయం కారణంగా హార్దిక్ టెస్టు ఫార్మాట్‌ ఆడాలా లేక పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలా అనే డైలమాలో ఉన్నాడు‌. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలక ఆటగాడైన హార్దిక్‌.. టెస్టు క్రికెట్‌ను వదిలేయాలనే ఉద్దేశం ఉన్నటు కనబడుతోంది. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టి సారిస్తానని పాండ్యా తెలిపాడు. తనకున్న ప్రధాన బలం ఎనర్జీనేనని, అన్ని ఫార్మాట్లు ఆడితే తన ఆటను బ్యాలెన్స్‌ చేసుకోవడం కష్టమవుతుందన్నాడు.

Story first published: Tuesday, August 18, 2020, 9:06 [IST]
Other articles published on Aug 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X