న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌కు ఐదు పరుగుల పెనాల్టీ: అంఫైర్‌తో వాగ్వాదానికి దిగిన వార్నర్ (వీడియో)

David Warner Angry After Umpire Punished Him For 'Damaging The Pitch' || Oneindia Telugu
 For What: David Warner Left Fuming After Australia Get Five-Run Penalty - Watch Video

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సోమవారం నాలుగో రోజు ఆటలో భాగంగా డేవిడ్‌ వార్నర్‌ పరుగు తీసే క్రమంలో డేంజర్‌ జోన్‌లో పరుగు తీశాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ ఆస్ట్రేలియాకు ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు.

దీంతో అంపైర్‌ను డేవిడ్ వార్నర్‌ ప్రశ్నించాడు. అలీమ్ దార్ కాస్త ఘాటుగానే తిరస్కరించడంతో వార్నర్‌ మరొ అంపైర్‌ ఎరాస్‌మస్‌ వద్దకు వెళ్లి తాను ఏం తప్పు చేశానో చెప్పాలంటూ అతడితో వాగ్వాదానికి దిగాడు. తాను షాట్‌ ఆడి జంప్‌ చేశానని, ఏం చేయాలో అంపైర్లు చెప్పాలి కదా? అంటూ వాగ్వాదం చేశాడు.

వందేమాతరం నినాదంతో మార్మోగిన స్టేడియం.. వీడియో చూస్తే గూస్‌బంప్సే!!వందేమాతరం నినాదంతో మార్మోగిన స్టేడియం.. వీడియో చూస్తే గూస్‌బంప్సే!!

అంపైర్లు సైతం వెనక్కి తగ్గకపోవడంతో ఆస్ట్రేలియాకు ఐదు పరుగుల పెనాల్టీని విధించారు. ఫలితంగా ఆస్ట్రేలియా చేసిన స్కోరులో ఐదు పరుగులు తగ్గించారు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్‌ (111 నాటౌట్‌) సెంచరీ సాధించగా, లబుషేన్‌(59) హాఫ్‌ సెంచరీ సాధించడంతో రెండో ఇన్నింగ్స్‌ను 217/2 వద్ద డిక్లేర్డ్‌ చేసింది.

'సంగక్కర వ్యక్తిగతంగా దూషించాడు.. నేను అతని భార్య గురించి కామెంట్‌ చేశా''సంగక్కర వ్యక్తిగతంగా దూషించాడు.. నేను అతని భార్య గురించి కామెంట్‌ చేశా'

ఫలితంగా ఆస్ట్రేలియాకు 420 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే, ఫీల్డ్ అంఫైర్ పెనాల్టీ కారణంగా వారి ఆధిక్యం 415 పరుగులకు కుదించబడింది. అనంతరం 416 పరుగుల విజయ లక్ష్యంతో న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఆసీస్ పేసర్లు మెరవడంతో కివీస్‌ వంద పరుగులు దాటకుండానే ఐదు వికెట్లు కోల్పోయింది.

Story first published: Monday, January 6, 2020, 12:17 [IST]
Other articles published on Jan 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X