న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోపం నాకూ వస్తుంది... కానీ నియంత్రించుకునేవాడిని: ధోని

Feel angry at times but I control my emotions better than some others: MS Dhoni

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోనీని అభిమానులు ముద్దుగా 'కెప్టెన్ కూల్' అని పిలుచుకునే సంగతి తెలిసిందే. అయితే, అందరిలానే మైదానంలో అసహనం, కోపం తనకీ వస్తాయని కాకపోతే భావోద్వేగాలను నియంత్రించుకుంటానని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు.

తాజాగా బుధవారం మాస్టర్‌ కార్డ్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా ధోని మీడియాతో మాట్లాడుతూ "అందరిలాగే నాకూ భావోద్వేగాలు ఉంటాయి. అయితే, ఇతరులతో పోలిస్తే నేను భావోద్వేగాలను బలంగా నియంత్రించుకోగలను" అని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ సెమీ ఫైనల్‌లో భారత్ నిష్క్రమించిన తర్వాత ధోని తొలిసారి ఓ ప్రకటనలో పాల్గొన్నాడు.

ఎన్నో సార్లు నిరాశకు గురయ్యా

ఎన్నో సార్లు నిరాశకు గురయ్యా

"మైదానంలో ఎన్నో సార్లు నిరాశకు గురయ్యాను. కొన్నిసార్లు కోపం, అసహనం వచ్చేవి. కానీ, ఆ క్షణంలో నా భావోద్వేగాలు కంటే జట్టును ముందుకు నడిపించడమే ముఖ్యం. దీంతో వాటిని అధిగమించి మ్యాచ్‌పై దృష్టి సారిస్తా. తర్వాత బంతిని ఎవరికి ఇవ్వాలి? బరిలోకి ఎవరిని దించాలి? అనే వాటిపైనే ఆలోచిస్తాను. ఇలా నా భావోద్వేగాలను నియంత్రించుకుంటాను" అని ధోని తెలిపాడు.

మ్యాచ్ తుది ఫలితం కంటే

మ్యాచ్ తుది ఫలితం కంటే

మ్యాచ్ తుది ఫలితం కంటే ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైనదని ధోని మరోసారి నొక్కిచెప్పాడు. "టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు ఉంటాయి. మనం నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సమయం ఉంటుంది. అదే టీ20ల్లో ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఏ నిర్ణయమైనా క్షణాల్లోనే తీసుకోవాలి. కాబట్టి డిమాండ్లు భిన్నంగా ఉంటాయి" అని ధోని చెప్పాడు.

జట్టు మొత్తంపై ప్రభావం

జట్టు మొత్తంపై ప్రభావం

"ఇది ఒక వ్యక్తి కావచ్చు, అతను తప్పు చేసాడా లేదా దాని ప్రభావం మొత్తం జట్టుపై పడొచ్చు. ఫార్మాట్ ఏమైనప్పటికీ మేము ప్రణాళికను అమలు చేయలేకపోవచ్చు. కానీ, ఒక జట్టుగా మేము సాధించాలనుకుంటున్నది టోర్నమెంట్‌ను గెలవడమే అంతమి లక్ష్యం. ఆటగాడిగా తమ బాధ్యతను అందరూ పూర్తిగా నిర్వర్తించాలి" అని ధోనీ తెలిపాడు.

"బౌల్ అవుట్" గురించి ధోని

దక్షిణాఫ్రికాలో జరిగిన 2007 ఐసీసీ వరల్డ్ టీ20లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో "బౌల్ అవుట్" గురించి ధోని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. "వరల్డ్‌కప్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అందులో 'బౌల్ అవుట్' ఒకటి. ప్రతి ప్రాక్టీస్ సెషన్‌కు ముందు, ప్రతి వార్మప్ మ్యాచ్‌కు ముందు తర్వాత 'బౌల్ అవుట్'ను ప్రాక్టీస్ చేశాం" అని ధోని తెలిపాడు.

మాకు చాలా ఫన్నీగా

మాకు చాలా ఫన్నీగా

"ఆ సమయంలో అది మాకు చాలా ఫన్నీగా అనిపించేది. అయితే, ఎవరైతే ఎక్కువసార్లు వికెట్ కొట్టారో అతడిని అలాంటి పరిస్థితి ఎదురైతే ఉపయోగిస్తాం. దీనికి నాకు బౌలర్‌తో దీనికి సంబంధం లేదు. దీన్ని ప్రతిరోజూ చేస్తూనే ఉంటాం. అయితే, సరైన సమయం వచ్చినప్పుడు ఎవరైతే ఉత్తమ హిట్-రేషియో కలిగి ఉన్నారో వారిని ఉపయోగించుకుంటాం" అని ధోని తెలిపాడు.

ధోని చివరి వరకు

ధోని చివరి వరకు

కాగా, ఇటీవలే ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ధోని టీమిండియా విజయం కోసం ఆఖరి వరకు పోరాడాడు. చివర్లో ధోని రనౌట్ కావడంతో టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని రెండు నెలలు పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. అనంతరం విండిస్ పర్యటనకు దూరమయ్యాడు.

బంగ్లాతో సిరిస్‌కు దూరమే

బంగ్లాతో సిరిస్‌కు దూరమే

ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా ధోనీ అందుబాటులో లేడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ జట్టు టీ20 సిరిస్ కోసం భారత పర్యటనకు రానుంది. బంగ్లాదేశ్‌తో జరగనున్న ఈ సిరిస్‌కు కూడా ధోని అందుబాటులో ఉండటం లేదని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Story first published: Thursday, October 17, 2019, 14:13 [IST]
Other articles published on Oct 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X