న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దీపక్ చాహర్ మామూలోడు కాదు! అతడి కష్టం వెనుక తండ్రి మద్దతు!

Fathers Tales: The Red & White story of Deepak Chahar

హైదరాబాద్: దీపక్ చాహర్... నాగ్‌పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడో టీ20 ముగిసిన తర్వాత ఒక్కసారిగా వైరల్ అయిన పేరు. అందుకు కారణం టీ20ల్లో తొలి హ్యాట్రిక్ తీయడమే కాదు... ఒక మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. అటువంటి చాహల్‌ను ఒకానొక సమయంలో అసలు బౌలింగ్‌కే పనికిరాడని అన్నారు.

అది 2008... రాజస్థాన్‌ క్రికెట్‌లో యువ ఆటగాళ్ల కోసం ట్రయల్స్‌ సాగుతున్నాయి. ఈ ట్రయల్స్‌కు 16 ఏళ్ల దీపక్‌ చాహర్‌ కూడా హాజరయ్యాడు. అప్పట్లో ఆ రాష్ట్ర క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న గ్రెగ్‌ చాపెల్‌.. చాహర్‌ బౌలింగ్‌ను చూసి అతడిని టాప్‌-50లోకి కూడా ఎంపిక చేయకపోగా అసలు నీకు క్రికెట్‌లో భవిష్యత్తే లేదని తేల్చి చెప్పాడు.

బుమ్రా లాగా నిన్ను ఉపయోగిస్తా, నీతో బౌలింగ్‌ చేయిస్తా: రోహిత్ చెప్పిన మాటలతోనే!బుమ్రా లాగా నిన్ను ఉపయోగిస్తా, నీతో బౌలింగ్‌ చేయిస్తా: రోహిత్ చెప్పిన మాటలతోనే!

గ్రెగ్ ఛాపెల్ వ్యాఖ్యలతో చాహర్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆ సమయంలో అతడి తండ్రి లోకేంద్రసింగ్‌ మద్దతుగా నిలవడంతో తనకు క్రికెటర్‌గా భవిష్యత్తు లేదని చెప్పిన చోటే తానెంటో నిరూపించుకున్నాడు. 18 ఏళ్ల వయస్సులో రాజస్థాన్ జట్టు తరుపున రంజీల్లో అరంగేట్రం చేసి హైదరాబాద్‌పై పది పరుగులకే ఎనిమిది వికెట్లు తీసి అబ్బురపరిచాడు.

అద్భుత స్వింగ్‌తో కళ్లు చెదిరే బంతులు

అద్భుత స్వింగ్‌తో కళ్లు చెదిరే బంతులు

అద్భుత స్వింగ్‌తో కళ్లు చెదిరే బంతులు వేసి... క్రీజులోకి వచ్చిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 7.3 ఓవర్లు వేసి 10 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. చాహర్ ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 21 పరుగులకే కుప్పకూలింది. రంజీ చరిత్రలో అతి తక్కువ స్కోరును నమోదు చేసింది.

యూట్యూబ్‌లో అత్యధికమంది వీక్షించిన

యూట్యూబ్‌లో అత్యధికమంది వీక్షించిన

ఇప్పటికీ యూట్యూబ్‌లో అత్యధికమంది వీక్షించిన దేశవాళీ క్రికెట్ వీడియోగా ఆ మ్యాచ్ నిలిచింది. ఆ సీజన్‌లో 40కి పైగా వికెట్లు తీసి రాజస్థాన్‌ను రంజీల్లో చాంపియన్‌గా నిలిపాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో ఆరు వికెట్లు పడగొట్టి టీ20ల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

చాహర్ ప్రదర్శనపై తండ్రి

చాహర్ ప్రదర్శన తన తండ్రి లోకేంద్రసింగ్‌ చాహర్‌ను సంతోషంలో ముంచెత్తింది. దీపక్ చాహర్ 1992 ఆగస్టులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించాడు. తండ్రి లోకేంద్ర సింగ్ భారత వాయుసేనలో ఉద్యోగి. దీపక్ చాహర్ ప్రాక్టీస్ కోసం ఉద్యోగం నుంచి ఆయన విరమణ పొందారు. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో స్థిరపడ్డారు.

శిక్షణ, ఫిటెనెస్‌పై చాహర్‌ను శ్రమించేలా

శిక్షణ, ఫిటెనెస్‌పై చాహర్‌ను శ్రమించేలా

దీపక్ చాహర్‌ను అంతర్జాతీయ క్రికెటర్ చేయాలని ఆయన ఎన్నో కలలు కన్నారు. ఆ దిశగా చాహర్ తండ్రి అతడికి దిశానిర్దేశం చేయడంతో పాటు క్రికెట్ శిక్షణ, ఫిటెనెస్‌పై చాహర్‌ను శ్రమించేలా చేశాడు. బంగ్లాతో అద్భుత బౌలింగ్‌తో టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన నేపథ్యంలో చాహర్ తండ్రి గతాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ ప్రదర్శనతో మా ఇద్దరి కల నెరవేరింది

ఈ ప్రదర్శనతో మా ఇద్దరి కల నెరవేరింది

ఆయన మాట్లాడుతూ "ఈ ప్రదర్శనతో మా ఇద్దరి కల నెరవేరింది. నేను క్రికెటర్‌ కావాలనుకున్నా నా తండ్రి అంగీకరించలేదు. అందుకే నా కొడుకు ద్వారా నా కల తీర్చుకోవాలనుకున్నా. ఇందుకోసం మాల్కం మార్షల్‌, డేల్‌ స్టెయిన్‌ల వీడియోలు చూసి ఔట్ స్వింగ్‌లో మణికట్టు ఎలా ఉండాలో దీపక్‌కు శిక్షణ ఇచ్చేవాడిని. దీపక్‌ను టెస్టు బౌలర్‌గానూ చూడాలనుంది" అని అన్నాడు.

Story first published: Tuesday, November 12, 2019, 10:42 [IST]
Other articles published on Nov 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X